- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jio-Adani: చేతులు కలిపిన అదానీ గ్రూప్, జియో-బీపీ
ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో రెండు కంపెనీల ఇంధనాలు విక్రయిస్తారు

దిశ, బిజినెస్ బ్యూరో: బిలియనీర్లు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ తమ ఇంధన వ్యాపారాల కోసం కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్న తమ తమ గ్రూపుల రిటైల్ స్టేషన్లను ఉపయోగించి ఇంధనాన్ని విక్రయించడానికి చేతులు కలిపాయి. అదానీ గ్రూప్, జియో-బీపీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో రెండు కంపెనీల ఇంధనాలు విక్రయిస్తారు. అదానీ టోటక్ గ్యాస్‌కు చెందిన రిటైల్ స్టేషన్లలో జియో-బీపీ పెట్రోల్, డీజిల్, జియో-బీపీ బంకుల్లో అదానీ టోటల్ గ్యాస్ సీఎన్‌జీ డిస్పెన్సింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్ణయంతో కస్టమర్లకు కంపెనీల సేవలు మరింత వేగవంతంగా, విస్తృతంగా అందించేందుకు వీలవుతుందని, రెండు సంస్థ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే అవకాశాం కల్పిస్తుందని జియో-బీపీ ఛైర్మన్ సార్థక్ బెహురియా అన్నారు. తమ కంపెనీలకు కున్న సామర్థ్యాన్ని మరొక కంపెనీకి అందిస్తూ సహకారం అందించుకోవాలని, కస్టమర్లకు నాణ్యమైన ఇంధనాన్ని అందించడం ఈ ఒప్పందం లక్ష్యమని అదానీ టోటల్ గ్యాస్ సీఈఓ సురేష్ పి మంగ్లానీ తెలిపారు. కాగా, జియో-బీపీ దేశవ్యాప్తంగా 2,000 అవుట్‌లెట్‌ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. వీటిలో కొన్నింటిలో ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేసే సౌకర్యాలను అందిస్తోంది. కన్వీనియన్స్ స్టోర్‌లను కూడా నిర్వహిస్తోంది. అదానీ టోటల్ గ్యాస్ దేశవ్యాప్తంగా 650 సీఎన్‌జీ స్టేషన్లను నిర్వహిస్తోంది. కంప్రెస్డ్ బయోగ్యాస్, ఈవీ ఛార్జింగ్, ఎల్ఎన్‌జీలను కూడా అందిస్తోంది. దిగ్గజ కంపెనీల మధ్య జరిగిన ఈ ఒప్పందంతో భారత ఇంధన రిటైలింగ్ మార్కెట్లో పోటీ పెరగవచ్చని తెలుస్తోంది.






