Amazon: ప్రైమ్ మెంబర్‌షిప్ రద్దుపై పూర్తి రీఫండ్‌ ఇవ్వనున్న అమెజాన్

by S Gopi |

ఈ విధానాన్ని ఏప్రిల్ 9వ తేదీని ప్రారంభించనుంది.

Amazon: ప్రైమ్ మెంబర్‌షిప్ రద్దుపై పూర్తి రీఫండ్‌ ఇవ్వనున్న అమెజాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రైమ్ మెంబర్‌షిప్ క్యాన్సిలేషన్ పాలసీలో కీలక మార్పును ప్రకటించింది. సబ్‌స్క్రైబర్లు ఎప్పుడైనా సరే మెంబర్‌షిప్ క్యాన్సిల్ చేసుకుంటే పూర్తిగా రీఫండ్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ విధానాన్ని ఏప్రిల్ 9వ తేదీని ప్రారంభించనుంది. సాధారణంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న కస్టమర్లకు అదే రోజు లేదా మరుసటి డెలివరీ అందించడం, ప్రత్యేక డీల్స్, ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్‌తో సహా అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్ కంటెంట్‌కు యాక్సెస్ లభిస్తాయి. అయితే, మెంబర్‌షిప్ రద్దు ప్రక్రియను కంపెనీ మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో తాజా మార్పును తీసుకొచ్చింది. అయితే, ఇందులోనూ ఓ మెలిక ఉంది. కొత్త పాలసీ ప్రకారం, సబ్‌స్క్రైబర్లు తమ ప్రైమ్ మెంబర్‌షిప్ రద్దు కోసం ఎలాంటి కొనుగోళ్లు చేయనంత వరకు, ప్రైమ్ ప్రయోజనాలను ఉపయోగించనంత వరకు ఎప్పుడైనా సరే పూర్తి రీఫండ్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏవైనా ప్రయోజనాలు పొందితే, వాపసు ఉండదు. ఇప్పటివరకు ఉన్న దాని ప్రకారం, అమెజాన్ మెంబర్‌షిప్ తీసుకున్న మూడు రోజుల్లోపు మాత్రమే దాన్ని రద్దు చేసుకునే వీలుంది. ఇతర సందర్భాల్లో ఉపయోగించిన ప్రయోజనాల ఆధారంగా ఛార్జీలను వసూలు చేసి రీఫండ్ చేయడం జరుగుతుంది.

Next Story