- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amazon: రియల్-టైమ్ షాపింగ్ కోసం ఏఐ- పవర్డ్ లెన్స్ లైవ్‌ను లాంచ్ చేసిన అమెజాన్
ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు తమ చుట్టూ ఉన్న వస్తువులను స్కాన్ చేసి అమెజాన్‌లో కొనుగోలు చేసే వీలుంటుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులో తీసుకొచ్చింది. దీని ద్వారా కస్టమర్లు మరింత సౌకర్యవంతంగా, సులభంగా షాపింగ్ చేసేందుకు వీలవుతుందని అమెజాన్ చెబుతోంది. లెన్స్‌లైవ్ పేరుతో ప్రారంభించిన ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు తమ చుట్టూ ఉన్న వస్తువులను స్కాన్ చేసి అమెజాన్‌లో కొనుగోలు చేసే వీలుంటుంది. ఇది గూగుల్ లెన్స్ మాదిరిగానే ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను అమెరికాలోని 10 లక్షలకు పైగా ఐఓఎస్ కస్టమర్లకు అనుమతిచ్చింది. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని అమెజాన్ వెల్లడించింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించి అమెజాన్ ద్వారా కెమెరా స్క్రీన్‌పై కనిపించే వస్తువులను స్కాన్ చేయవచ్చు. అనంతరం ఆ వస్తువుకు మ్యాచింగ్ ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేసుకోవచ్చు. లెన్స్‌లైవ్ ద్వారా కెమెరాలో కనిపించే వస్తువుపై ట్యాప్ చేయడం ద్వారా ఫోకస్ అవుతుందని, దాన్ని షాపింగ్ బాస్కెట్‌లోకి సేవ్ చేసే ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ ఫీచర్ అమెజాన్ తన ఏఐ అసిస్టెంట్ రుఫుసును కూడా వాడుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఏదైనా ఉత్పత్తిని సెర్చ్ చేసే సమయంలో సమాచారం, ఇంటరాక్టివ్ కోసం ఇది పనిచేస్తుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) టెక్నాలజీ ఆధారంగా పనిచేయనుంది.






