- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amazon: హైదరాబాద్ సహా మరిన్ని నగరాలకు 'అమెజాన్ నౌ' డెలివరీ సేవలు
కొత్తగా పూణే, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, జైపూర్, లక్నో, అహ్మదాబాద్ వంటి నగరాలకు విస్తరించనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఆల్ట్రా-ఫాస్ట్ డెలివరీ ‘అమెజాన్ నౌ’ సేవలైన మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. లాజిస్టిక్స్, ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లో పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సేవలను 100 నగరాలకు విస్తరించనుంది. ఇందులో భాగంగా 1,000కు పైగా మైక్రో-ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం అమెజాన్ నౌ సేవలను ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు నగరాల్లో అందిస్తోంది. కొత్తగా పూణే, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, జైపూర్, లక్నో, అహ్మదాబాద్ వంటి నగరాలకు విస్తరించనుంది. కిరాణా వస్తువులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు, ఫ్యాషన్ వస్తువులు, చిన్న గృహోపకరణాలు, చిన్నపిల్లల ఉత్పత్తులు, పెంపుడు జంతువుల సామాగ్రి, హెల్త్ సప్లిమెంట్లు వంటి నిత్యావసరాలు ఈ సేవల ద్వారా నిమిషాల్లోనే డెలివరీ అవుతాయి. అమెజాన్ ఇండియా అధికారుల ప్రకారం, ఈ విస్తరణతో 16,000 మందికి పైగా రైతులు, విక్రేతలు తమ ఉత్పత్తులను నేరుగా కస్టమర్లకు చేరవేస్తారు. దీనివల్ల సరఫరా మరింత వేగవంతం అవుతుందని, వినియోగదారులకు తాజా, నాణ్యమైన ఉత్పత్తులు అందుతాయని కంపెనీ పేర్కొంది.






