- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amazon Layoff: 30 వేలు కాదు, ఉద్యోగుల తొలగింపుపై అమెజాన్ ప్రకటన
ఏఐ ఖర్చు వల్ల అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెటీపేర్కొన్నారు

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగాల తొలగింపుపై స్పష్టత ఇచ్చింది. కార్పొరేట్ విభాగంలో భారీగా 14,000 మందిని తొలగిస్తున్నామని మంగళవార్మ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు కంపెనీ 30 వేల మందిని తీసేస్తున్నట్టు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే కంపెనీ అధికారికంగా స్పందించాల్సి వచ్చింది. ముఖ్యంగా కృత్రిమ మేధ(ఏఐ) కోసం ఎక్కువ ఖర్చు ఉండటం వల్ల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెటీ లేఆఫ్‌కు ప్రభావితమైన ఉద్యోగులకు పంపిన మెమోలో పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించాలని అనుకుంటున్నాం. దీనికోసం అధికార యంత్రాంగాన్ని తగ్గించి, అవసరంలేని ఉద్యోగాల పాత్రను తీసేస్తున్నామని, తద్వారా ఉన్న వనరులతో మెరుగైన పనితీరును కొనసాగిస్తామని అన్నారు. ఉద్యోగాలను కోల్పోయిన వారికి సంస్థ నుంచి మద్దతు లభిస్తుందని కంపెనీ తెలిపింది. అమెజాన్ నిర్ణయం కారణంగా భారత్ సహా అనేక దేశాల్లోని ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. కాగా, అంతకుముందు సంస్థలో 30 వేల మందిని తొలగిస్తారనే ప్రచారం జరిగింది. దీన్ని అంతర్జాతీయ మీడియా కూడా ప్రస్తావిస్తూ, మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మందిని తీసేయవచ్చని పేర్కొన్నాయి. ఇదే గనక జరిగి ఉంటే 2022 ఆఖర్లో కంపెనీ తీసుకున్న 27 వేల మంది తొలగింపు తర్వాత ఇదే అత్యధికం అయ్యేది. అమెజాన్ సంస్థ గడిచిన రెండేళ్ల కాలంగా కమ్యూనికేషన్స్, డివైజ్‌లు, పాడ్‌కాస్టింగ్ సహా ఇతర విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది.
Read More... Amazon: అమెజాన్‌లో 30,000 మంది తొలగింపు






