- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amazon Sale: మొదలైన అమెజాన్ సేల్.. టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు
స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల నుంచి స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌వాచ్‌ల వరకు తక్కువ ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా పండుగ సీజన్ కోసం తీసుకొచ్చిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది. ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న కస్టమర్ల కోసం ఒకరోజు ముందుగానే అమెజాన్ సేల్‌ను ప్రారంభించింది. ఇందులో ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్లు, గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల నుంచి స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌వాచ్‌ల వరకు కస్టమర్లకు టాప్ బ్రాండ్‌లలోనూ తక్కువ ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. అలాగే క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీల ద్వారా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, అదనపు డిస్కౌంట్లు ఉన్నాయి.
టాప్ ల్యాప్‌టాప్, టీవీ డీల్స్
* ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు తగ్గింపు: కస్టమర్లు అమెజాన్ సేల్‌లో యాపిల్, ఏసర్, ఆసూస్, హెచ్‌పీ, డెల్, లెనోవో ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఉదాహరణకు, ఇంటెల్ కోర్ ఐ4 13వ జెన్ ఆసూస్ వివోబుక్ ధర రూ. 69,990 బదులుగా రూ. 46,990కే లభిస్తోంది. ఇంటెల్ కోర్ ఐ7 13 జెన్‌తో వచ్చే లెనొవో స్లిం3 కూడా రూ. 57,990కి అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన కార్డుల ద్వారా 12 నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ ఎంచుకునే అవకాశం ఉంది.
* తక్కువ ధరకు మ్యాక్ మిని(2024): కొత్త ఎం4 చిప్‌తో వచ్చిన యాపిల్ మ్యాక్ మిని ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ చెల్లింపుల ద్వారా రూ. 47,990 చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
* సోనీ బ్రావియా 2 సిరీస్ టీవీ: సోనీ బ్రావియా 2 సిరీస్ 50 అంగుళాల 4కె అల్ట్రా హెచ్‌డీ ఇప్పుడు రూ. 48,849 ధరకు లభిస్తోంది.
* శామ్‌సంగ్ క్రిస్టల్ 4కె టీవీ: శాంసంగ్ 50 అంగుళాల క్రిస్టల్ 4కె అల్ట్రా హెచ్‌డీ టీవీ ఇప్పుడు రూ. 45,700కే అందుబాటులో ఉంది.
టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్
* రూ. 50,000 లోపు ఐఫోన్ 15: 2023లో రూ. 79,900 ధరకు విడుదలైన ఐఫోన్ 15 ఇప్పుడు సేల్ సందర్భంగా రూ. 46,999 ధరకు అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన కార్డ్ లావాదేవీలపై అదనంగా రూ. 1,250 డిస్కౌంట్ లభిస్తుంది. కస్టమర్లు మరింత రాయితీ కోసం పాత ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ ద్వారా పొందవచ్చు.
* శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా డీల్: గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఇప్పుడు రూ. 71,999కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలైన సమయంలో ఉన్న రూ. 1,34,999తో పోలిస్తే భారీ డిస్కౌంట్‌కు లభిస్తోంది. అదనంగా బ్యాంక్ లేదా కూపన్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో మరింత తక్కువ ధరకు కొనవచ్చు.
రూ. 40,000 లోపు బెస్ట్ డీల్స్:
* వన్‌ప్లస్ 13ఆర్: రూ. 37,999; బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ. 35,749
• ఒప్పో రెనో 14: రూ. 37,998; బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ. 30,999
• వన్‌ప్లస్ నార్డ్ 5: రూ. 30,499; బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ. 28,499
• ఐకూ నియో 10ఆర్ 5జీ: రూ. 28,998
• వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5: రూ. 25,499
• ఒప్పో కె13: రూ. 16,675; బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ. 14,999కి లభిస్తుంది.






