- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amazon: పండుగ సీజన్ కోసం అమెజాన్ లక్షన్నర ఉద్యోగుల నియామకం
ఈ ఏడాది దేశవ్యాప్తంగా 400 కంటే ఎక్కువ నగరాల్లో ఈ ఉద్యోగాలను కల్పిస్తున్నట్టు పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైంది. ప్రతి ఏడాది లాగే ఈ సీజన్‌కు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా పెద్ద ఎత్తున సీజనల్ జాబ్‌లను కల్పించనున్నట్టు సోమవారం ప్రకటించింది. కంపెనీ తన ఫుల్‌ఫిల్‌మెంట్, సార్ట్ సెంటర్లు, డెలివరీ విభాగాల్లో 1,50,000 కంటే ఎక్కువ సీజనల్ ఉద్యోగులను తీసుకుంటామని వెల్లడించింది. పండుగ సీజన్‌కు భారీగా అమ్మకాలు జరుగుతాయని, డిమాండ్‌కు తగిన స్థాయిలో ఉద్యోగుల అవసరం ఏర్పడుతుందని అమెజాన్ అభిప్రాయపడింది. ముఖ్యంగా గిగ్ వర్కర్లకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. అలా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 400 కంటే ఎక్కువ నగరాల్లో ఈ ఉద్యోగాలను కల్పిస్తున్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా కంపెనీ సేవలందించే అన్ని చోట్ల కస్టమర్లకు వేగవంతమైన డెలివరీ సేవలను అందించడమే తమ లక్ష్యం. దీనికోసమే ఈసారి లక్షన్నర కంటే ఎక్కువ మంది అదనపు ఉద్యోగులతో ఫుల్‌ఫిల్‌మెంట్, లాజిస్టిక్ నెట్‌వర్క్‌ను విస్తరించే పనిచేస్తున్నాం. వారిలో చాలామంది పండుగ సీజన్ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంటుందని అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్-ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ అన్నారు. ఈ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో లేదా డెలివరీ రూట్లలో ఉన్న ఉద్యోగులందరీ భద్రతకు కంపెనీ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన వెల్లడించారు. కాగా, ఈ ఏడాది పండుగ సీజన్ డిమాండ్ కారణంగా ఈ-కామర్స్ రంగంలో ఉద్యోగాల సృష్టికి గణనీయంగా ఉంటుందని నియామక సంస్థలు అంచనా వేస్తున్నాయి. రిటైల్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్, వినియోగ సేవల్లో రెండు లక్షల వరకు సీజనల్ ఉద్యోగాలు ఉంటాయని ఎన్ఎల్‌బీ సర్వీసెస్ అంచనా వేసింది.






