Amazon Sale: 'ప్రైమ్ డే సేల్ ' తేదీలను ప్రకటించిన అమెజాన్

by S Gopi |

ప్రైమ్ డే సందర్భంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాల (ఎస్ఎంబీ) నుంచి 1,600కి పైగా కొత్త ఉత్పత్తులు విడుదల అవుతాయి.

Amazon Sale: ప్రైమ్ డే సేల్  తేదీలను ప్రకటించిన అమెజాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ప్రతి ఏడాది ప్రైమ్ కస్టమర్ల కోసం నిర్వహించే అతిపెద్ద సేల్‌కు సంబంధించి తేదీలను ప్రకటించింది. ఈ ఏడాది జూలై 12-14 తేదీల మధ్య ఈ సేల్ నడుస్తుందని, ఈ 72 గంటల సేల్ సందర్భంగా ప్రత్యేక బ్రాండ్ల లాంచ్‌లు, బ్యాంక్ ఆఫర్‌లు, ఫాస్ట్ డెలివరీ, ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్‌లు ఉంటాయని కంపెనీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ప్రైమ్ డే సందర్భంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాల (ఎస్ఎంబీ) నుంచి 1,600కి పైగా కొత్త ఉత్పత్తులు విడుదల అవుతాయి. వాటితో పాటు 400కి పైగా దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లు లాంచ్ చేయనున్నట్టు అమెజాన్ తెలిపింది. అందులో శాంసంగ్, వన్‌ప్లస్, ఇంటెల్, ఐకూ, హెచ్‌పీ, లెనోవో సహా అనేక బ్రాండ్లు ఉన్నాయి. మహిళా వ్యాపారులు, చేతివృత్తులవారు, స్టార్టప్‌లతో సహా లక్షలాది మంది విక్రేతలకు చెందిన ఉత్పత్తులు సేల్‌లో ఉంటాయని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో పాటు ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం రాయితీ ఇస్తోంది. ఇతర బ్యాంకుల ద్వారా ఈఎంఐ చెల్లింపులపైనా డిస్కౌంట్ ఇవ్వనుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ యూజర్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్, 5 శాతం అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా అమెజాన్ పే నుంచి చెల్లించేవారికి ఫ్లైట్ టికెట్లపై 25 శాతం, మూవీ టికెట్స్‌పై 100 శాతం, హోటల్ బుకింగ్స్ 50 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు అమెజాన్ పేర్కొంది. ఈ సేల్‌లో ప్రైమ్ యూజర్లకే కాకుండా సాధారణ కస్టమర్లకు కూడా కొన్ని ఆఫర్లు ఉంటాయని స్పష్టం చేసింది.

Next Story