Amazon: మరోసారి స్మార్ట్‌ఫోన్ తెచ్చే ప్రయత్నంలో అమెజాన్

by S Gopi |

'ట్రాన్స్‌ఫార్మర్' అనే కోడ్‌నేమ్‌తో, వాయిస్ అసిస్టెంట్ అలెక్సా, అమెజాన్ సర్వీసెస్‌తో లింక్ అయ్యేలా దీన్ని రూపొందించినట్టు తెలుస్తోంది

Amazon: మరోసారి స్మార్ట్‌ఫోన్ తెచ్చే ప్రయత్నంలో అమెజాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి స్మార్ట్‌ఫోన్ రంగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. 'ట్రాన్స్‌ఫార్మర్' అనే కోడ్‌నేమ్‌తో, వాయిస్ అసిస్టెంట్ అలెక్సా, అమెజాన్ సర్వీసెస్‌తో లింక్ అయ్యేలా దీన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. ఇది సాధారణ స్మార్ట్‌ఫోన్‌లాగే పనిచేస్తుందని, ఇందులో ఏఐ సేవలు కూడా ఉంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా అమెజాన్ యాప్ నుంచి షాపింగ్‌ని సులభతరం చేస్తూనే, ప్రైమ్ వీడియోలు, అమెజాన్ మ్యూజిక్, ఫుడ్ డెలివరీ వంటి సేవలను పొందేందుకు వీలుగా దీన్ని తీసుకురావాలని అమెజాన్ భావిస్తోంది. ప్రస్తుతానికి ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలు, ధర వంటి వివరాలను కంపెనీ అధికారిక వెల్లడించలేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ప్రాజెక్ట్‌కు పట్టాలెక్కించాలని అమెజాన్ భావిస్తోంది. అయితే, దశాబ్దం క్రితం 2014లో అమెజాన్ ఫైర్ ఫోన్ పేరుతో స్మార్ట్‌ఫోన్ తెచ్చే ప్రయత్నం చేసింది. గిరాకీ లేకపోవడం, సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో లభించే పాపులర్ యాప్‌లు లేకపోవడంతో ఘోరంగా విఫలమైంది.

Next Story