- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amazon Pay : అమెజాన్ పే లో ఫిక్స్డ్ డిపాజిట్ సేవలు.వడ్డీ అధికం.మహిళలకు అదనం
ఆన్ లైన్ డెలివరీలతో మొదలై.. యూపీఐ పేమెంట్స్, బిల్ పేమెంట్స్ సేవలు అందిస్తోన్న అమెజాన్ పే.. ఇప్పుడు కొత్తగా ఫిక్స్డ్ డిపాజిట్ రంగంలోకి అడుగుపెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్ : కాదేదీ బిజినెస్ కు అనర్హం అన్న చందంగా ఉంది ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ పనితీరు. ఆన్ లైన్ డెలివరీలతో మొదలై.. యూపీఐ పేమెంట్స్, బిల్ పేమెంట్స్ సేవలు అందిస్తోన్న అమెజాన్ పే.. ఇప్పుడు కొత్తగా ఫిక్స్డ్ డిపాజిట్ రంగంలోకి అడుగుపెట్టింది. అమెజాన్ పే లోనే ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తోంది. దీనికోసం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులతో టై అప్ అయింది. అమెజాన్ పే 7.25 శాతం నుంచి 8 శాతం వడ్డీరేటు ఇస్తామని ప్రకటించింది. ప్రత్యేకంగా శ్రీరామ్ ఫైనాన్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసే మహిళలకు 0.5 శాతం అదనంగా వడ్డీ లభిస్తుందని తెలిపింది. అంటే 8.05 శాతం వడ్డీ అనమాట.
అమెజాన్ పే లో ఫిక్డ్స్ డిపాజిట్ ఎలా?
అమెజాన్ పే ఓపెన్ చేశాక ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ ఆప్షన్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ లో సంవత్సరానికి ఫిక్స్డ్ డిపాజిట్ పై 7.25 శాతం, మీడియం టర్మ్ లో రెండేళ్లకు 7.5 శాతం, లాంగ్ టర్మ్ లో ఐదేళ్లకు 8 శాతం వడ్డీని అందిస్తోంది. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, స్లైస్, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ లలో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పిస్తోంది. రూ.1000 మొదలుకుని ఎంతైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. ఎఫ్ డీలపై డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) కింద రూ.5 లక్షల వరకూ బీమా ఉంటుందని పేర్కొంది. ఎఫ్ డీ చేసేందుకు ఎలాంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని అమెజాన్ స్పష్టం చేసింది.
Similar News : LIC: 'జీవన్ ఉత్సవ్' సింగిల్ ప్రీమియం ప్లాన్ లాంచ్ చేసిన ఎల్ఐసీ






