- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amazon: ఆసియాలో 2వ అతిపెద్ద కార్యాలయాన్ని ప్రారంభించిన అమెజాన్
ఇప్పటికే కంపెనీకి హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో అతిపెద్ద కార్యాలయం ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా భారత్‌లో మరో అతిపెద్ద కార్యాలయాన్ని ప్రారంభించింది. సోమవారం కంపెనీ బెంగళూరులో ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆఫీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే కంపెనీకి హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో అతిపెద్ద కార్యాలయం ఉంది. కొత్తగా ప్రారంభించిన ఆఫీసు 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని, దేశీయంగా ఈ-కామర్స్, కార్యకలాపాలు, చెల్లింపులు, టెక్నాలజీ, సెల్లర్ సహా అన్ని విభాగాల్లో 7,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేసేలా ఇది ఉంటుంది. ఈ భవనం 12 అంతస్తులతో కూడిన క్యాంపస్ అని కంపెనీ స్పష్టం చేసింది. ఈ కార్పొరేట్ ఆఫీస్ ఉద్యోగులందరూ ఒకే చోట మెరుగైన సహకారంతో పనిచేస్తారు. ఈ కొత్త క్యాంపస్ అమెజాన్ భారత పెట్టుబడుల్లో భాగమని అమెజాన్ స్పష్టం చేసింది. అమెజాన్ ఇప్పటికే దేశంలో రూ. 3.63 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. 2030 నాటికి దేశంలో అదనంగా మరో రూ. 3 లక్షల కోట్ల వరకు పెట్టుబడికి కట్టుబడి ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. కొత్త ఆఫీస్ ప్రారంభం సందర్భంగా అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ మాట్లాడుతూ, అమెజాన్‌కు భారత్ దీర్ఘకాలిక ప్రాధాన్యత కలిగిన దేశంగా ఉందని పేర్కొన్నారు.






