- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amazon: అమెజాన్‌లో మరో రౌండ్ లేఆఫ్స్
ఖర్చులను తగ్గిస్తూ, కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా మార్చే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ యాండీ జెస్సీ తెలిపారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగాల కోతలకు సిద్ధమవుతోంది. ఈసారి కంపెనీ సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్ విభాగంలోని కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ధృవీకరించింది. ఈ విభాగం థర్డ్ పార్టీ విక్రేతలకు ఆన్‌బోర్డింగ్, లాజిస్టిక్స్, అకౌంట్ మేనేజ్‌మెంట్ వంటి కీలక సేవలను అందిస్తుంది. కంపెనీ ఖర్చులను తగ్గిస్తూ, కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా మార్చే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ యాండీ జెస్సీ తెలిపారు. ఎంతమందిని తొలగించనున్నదనే విషయంపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. అమెజాన్ ఇప్పటికే వివిధ విభాగాల్లో దాదాపు 30 వేల ఉద్యోగాలను తొలగించిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా అమెజాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో ఎక్కువ పెట్టుబడులు పెడుతోంది. రిటైల్, లాజిస్టిక్స్, క్లౌడ్ సేవలు, ప్రకటనల విభాగాల్లో ఏఐ టూల్స్ వినియోగాన్ని కంపెనీ వేగంగా పెంచుతోంది. ఉద్యోగుల పనిలో ఆటోమేషన్ పెరగడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని జెస్సీ స్వయంగా చెప్పారు. ఈ లేఆఫ్ ప్రభావం భారత్‌లోని అమెజాన్ ఉద్యోగులపైనా పడనుంది. ముఖ్యంగా సపోర్ట్ ఆపరేషన్స్, అకౌంట్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్ బ్యాక్-ఎండ్ సేవల్లో పనిచేసే వారిపై ఉండొచ్చని సమాచారం.
ఇదే బాటలో సిస్కో, లింక్డ్ఇన్ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశాయి. నెట్‌వర్కింగ్ కంపెనీ సిస్కో ఏఐ, సైబర్ సెక్యూరిటీపై ఎక్కువ దృష్టి సారిస్తోంది. ఈ కారణంగా పాత విభాగాల్లోని వారిని తొలగించి, కొత్త సాంకేతికతపై పెట్టుబడి పెడుతోంది. దీంతో మొత్తం ఉద్యోగులలో సుమారు 5 శాతం (దాదాపు 4,000 మంది) తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డ్‌ఇన్ కూడా సుమారు 5 శాతం మందిని (దాదాపు 875 మంది) తొలగిస్తోంది. మార్కెటింగ్, ఇంజనీరింగ్, ప్రొడక్ట్ టీమ్స్‌లో ఈ కోతలు ఉండనున్నాయి.






