Amazon: తగ్గిన ఉత్పత్తులతో 'జీఎస్టీ స్టోర్' ప్రత్యేక సెక్షన్ ప్రారంభించిన అమెజాన్

by S Gopi |   (  Updated:2025-09-22 17:36:30  IST  )

పన్నులు తగ్గిన ఉత్పత్తులు విడిగా కనిపించేలా 'జీఎస్టీ స్టోర్ ' పేరుతో సెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Amazon: తగ్గిన ఉత్పత్తులతో జీఎస్టీ స్టోర్ ప్రత్యేక సెక్షన్ ప్రారంభించిన అమెజాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేసిన జీఎస్టీ సంస్కరణలకు సంబంధించి కస్టమర్లకు ప్రయోజనాలను అందించేందుకు ఈ-కామర్స్ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే అమెజాన్ ఇండియా కూడా తగ్గిన పన్నుల గురించి కస్టమర్లకు తెలిసేలా ప్రత్యేక సెక్షన్‌ను తీసుకొచ్చింది. పన్నులు తగ్గిన ఉత్పత్తులు విడిగా కనిపించేలా 'జీఎస్టీ స్టోర్ ' పేరుతో సెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఇతర విభాగాల్లో తక్కువ ధరలు ఉన్న వాటిని ఈ సెక్షన్‌లో పొందుపరిచింది. మంగళవారం(సెప్టెంబర్ 23) నుంచి గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుండటంతో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైమ్ సభ్యులకు సెప్టెంబర్ 22 అర్ధరాత్రి నుంచే ముందస్తు యాక్సెస్ లభిస్తుంది. జీఎస్టీ స్టోర్ బ్యాడ్జ్ వల్ల కస్టమర్లు తగ్గిన పన్ను ఆఫర్లను సులభంగా గుర్తించడం, షాపింగ్ చేయడానికి వీలవుతుంది. ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ సమయంలో ఈ బ్యాడ్జ్ ప్రైమ్ డీల్+జీఎస్టీ సేవింగ్స్ అని ఉంటుంది. సేల్ అందరికీ ఉన్న సమయంలో డీల్ విత్ జీఎస్టీ సేవింగ్స్ అని కనిపిస్తుందని అమెజాన్ వెల్లడించింది.

Next Story