Amazon ఉద్యోగుల తొలగింపులో భారత ఉద్యోగులకు షాక్!

by Disha Web Desk 17 |
Amazon ఉద్యోగుల తొలగింపులో భారత ఉద్యోగులకు షాక్!
X

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవల ఉద్యోగుల తొలగింపు సంఖ్యను పెంచిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 18 వేల మందిని తీసేయనున్నట్టు కంపెనీ సీఈఓ ఆండీ జస్సీ ఉద్యోగులకు పంపిన లేఖలో పేర్కొన్నారు. తాజాగా ఇందులో భారత కార్యకలాపాల్లోని 1 శాతం మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని ఓ నివేదిక తెలిపింది. సుమారు 1,000 మంది అమెజాన్ ఇండియా ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఈ విషయం బహిర్గతమైనప్పటికీ, అధికారికంగా కంపెనీ జనవరి 18న వివరాలను వెల్లడించనుంది. మొత్తం తొలగింపుల్లో ఎక్కువ భాగం ఈ-కామర్స్, హెచ్ఆర్ ఉద్యోగులు తొలగించనున్నారు. మహమ్మారి సమయంలో డిమాండ్‌కు అనుగుణంగా పెద్ద ఎత్తున నియామకాలను చేపట్టామని, ప్రస్తుతం ఖర్చుల నియంత్రణలో భాగంగా కొంతమందిని తీసేయక తప్పట్లేదని ఉద్యోగులకు పంపిన లేఖలో సంస్థ సీఈఓ తెలిపారు. తొలగించే ఉద్యోగులకు ప్యాకేజీలతో పాటు, ఆరోగ్య బీమా ప్రయోజనాలు, కొత్త ఉద్యోగాలు వెతుక్కునేందుకు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.


Next Story

Most Viewed