- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amazon India: దివ్యాంగ మహిళా విక్రయదారులకు అమెజాన్ సహకారం
అమెజాన్‌ల సెల్లర్లుగా ఉన్న దివ్యాంగ మహిళలకు అమెజాన్ సహేలీ ప్రోగ్రామ్ కింద వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా దేశంలోని దివ్యాంగ మహిళా వ్యాపారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఈ-కామర్స్ ఎకోసిస్టమ్‌లో దివ్యాంగ మహిళలు రాణించేందుకు అవసరమైన వనరులు, సాధనాలు, శిక్షణ అందించనున్నట్టు మంగళవారం ప్రకటనలో తెలిపింది. దీనికోసం ప్రముఖ యూత్4జాబ్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా అమెజాన్‌ల సెల్లర్లుగా ఉన్న దివ్యాంగ మహిళలకు అమెజాన్ సహేలీ ప్రోగ్రామ్ కింద వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నారు. ఆన్‌బోర్డింగ్, అకౌంట్ నిర్వహణ విషయంలో సహకారం అందించనున్నారు. ప్రతిభావంతులైన దివ్యాంగ మహిళలకు విస్తృత మార్కెట్ అవకాశాలను అందించడం, ఆన్‌లైన్‌లో తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు అమెజాన్ ప్లాట్‌ఫామ్‌ను వాడుకునేలా ఈ కార్యక్రమం మద్దతిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వీటితో పాటు మహిళా సెల్లర్లు డిజిటల్ మార్కెటింగ్, పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్, ప్రోడక్ట్ లిస్టింగ్ ఆప్టిమైజేషన్, అడ్వర్టైజింగ్ సొల్యూషన్స్ వంటి స్కిల్స్ ద్వారా వ్యాపారాన్ని స్థిరంగా కొనసాగించేందుకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొంది. కస్టమర్ల ప్రవర్తన, కస్టమర్ అంచనాలు, మార్కెట్ ట్రెండ్ గురించి మరింత అవగాహన ఏర్పడేందుకు డేటా ఆధారిత వివరాల కోసం యాక్సెస్ పొందుతారని అమెజాన్ ఇండియా వెల్లడించింది.






