5G స్మార్ట్ ఫోన్‌లపై భారీ తగ్గింపులతో Amazon కొత్త సేల్

by Disha Web Desk 17 |
5G స్మార్ట్ ఫోన్‌లపై భారీ తగ్గింపులతో Amazon కొత్త సేల్
X

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ కొత్తగా మరోక సేల్‌ను తీసుకొచ్చింది. స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపులు, డిస్కౌంట్‌లతో '5G రివల్యూషన్ సేల్‌' ను ప్రకటించింది. ఈ సేల్ మే 27న ప్రారంభమయింది. మే 31 వరకు అందుబాటులో ఉంటుంది. వినియోగదారులకు అతి తక్కువ ధరలో 5G ఫోన్‌లను అందించాలనే ఉద్ద్యేశంతో కంపెనీ ఈ సేల్‌ను తెచ్చింది. దీనిలో భాగంగా OnePlus, realme, Samsung, vivo, Tecno తదితర ఇతర టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లపై 40% వరకు తగ్గింపు పొందవచ్చు.



కొనుగోలు సమయంలో నెలకు రూ.1,666 నుండి నో-కాస్ట్ EMI సదుపాయం కూడా ఉంది. అలాగే, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, HDFC బ్యాంక్ కార్డులపై 10 శాతం తగ్గింపు, ఎంపిక చేసిన ఫోన్లలో 24 నెలల వరకు ప్రైమ్ మెంబర్‌షిప్‌ కూడా లభిస్తుంది. ఆఫర్‌లో భాగంగా iQoo 11 5G స్మార్ట్ ఫోన్ రూ. 5,000 తగ్గింపు బోనస్, Redmi Note 12 5G ఫోన్ రూ. 2,000 ఎక్స్చేంజ్ తగ్గింపు, OnePlus 10R 5G , Samsung Galaxy S23 Ultra 5G ఫోన్లపై రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లను పొందవచ్చు.


Next Story

Most Viewed