'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' తేదీలు ప్రకటించిన అమెజాన్ ఇండియా

by Dishanational1 |
గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ తేదీలు ప్రకటించిన అమెజాన్ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ ఆఫర్లతో కూడిన 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'కు సంబంధించిన తేదీలను ప్రకటించింది. జనవరి 13న ఈ ప్రత్యేక సేల్ ప్రారంభమవుతుందని బుధవారం వెల్లడించింది. ఈ సేల్‌లో ఎప్పటిలాగే ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లకు కొన్ని గంటలకు ముందే డీల్స్, డిస్కౌంట్‌లు పొందేందుకు అనుమతి ఉంటుంది. వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్‌లతో పాటు, కస్టమర్‌లు సేల్ సమయంలో వివిధ బ్యాంకు కార్డ్ లావాదేవీలపై అదనంగా తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చని అమెజాన్ ఇండియా వెల్లడించింది. ముఖ్యంగా మొబైల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్, ల్యాప్‌టాప్‌లతో పాటు యాక్సెసరీలు, అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు లభించనున్నాయి. ఈసారి సేల్‌లో ప్రత్యేకంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు లేదా ఈఎంఐలపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు అమెజాన్ తెలిపింది. అలాగే, ఐఫోన్ 13ను తక్కువ ధరకే అందిస్తుండగా, శాంసంగ్ గెలాక్సీ ఎస్23, ఎస్23 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 10 వేల డిస్కౌంట్ ఇస్తున్నట్టు అమెజాన్ ఇండియా పేర్కొంది. ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు, ఉపకరణాలపైనా 40 శాతం వరకు తగ్గింపు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఉపకరణాల కొనుగోళ్లపై 75 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్టు అమెజాన్ పేర్కొంది.


Next Story

Most Viewed