- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amazon India: గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ తేదీలు ప్రకటించిన అమెజాన్
అమెజాన్ ఎస్‌బీఐ కార్డ్‌తో జతకట్టి కార్డ్ కొనుగోళ్లపై తక్షణ డిస్కౌంట్‌లను, అదనపు ఎక్స్ఛేంజ్, ఈఎంఐ ఆఫర్‌లను అందిస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్త సేల్‌ను ప్రకటించింది. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్-2025 సేల్‌కు సంబంధించి శుక్రవారం తేదీలను వెల్లడించింది. వచ్చే నెల 1 తేదీ నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఎప్పటిలాగే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ముందస్తు యాక్సెస్ లభిస్తుంది. ఈ సేల్ సమయంలో కస్టమర్లు స్మార్ట్‌ఫోన్‌లు, ఉపకరణాలు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు, అమెజాన్ పరికరాలు సహా మరిన్నో ఉత్పత్తులపై ఆఫర్లను పొందనున్నారు. అంతేకాకుండా, అమెజాన్ ఎస్‌బీఐ కార్డ్‌తో జతకట్టి కార్డ్ కొనుగోళ్లపై తక్షణ డిస్కౌంట్‌లను, అదనపు ఎక్స్ఛేంజ్, ఈఎంఐ ఆఫర్‌లను అందిస్తుంది. ఎస్‌బీఐ కార్డు, ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. ఇంకా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌లు వంటి పెద్ద ఉపకరణాలు, అనేక ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై తగ్గింపులు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఈ సేల్ ఈవెంట్‌లోనే ట్రెండింగ్ డీల్స్, రాత్రి 8 గంటలకు ప్రత్యేక డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్‌తో సహా వివిధ పరిమిత-కాల ఆఫర్‌లు ఉంటాయి. మరికొద్ది రోజుల్లో ఇతర ఆఫర్ల వివరాలు కూడా వెల్లడించనున్నట్టు అమెజాన్ తెలిపింది. ఈ సేల్‌లో అమెజాన్ పే-ఆధారిత ఆఫర్‌లు, కూపన్ డిస్కౌంట్‌లు కూడా ఉండే అవకాశం ఉంది.






