- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amazon: అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్ ప్రక్రియ
తాజా తొలగింపులు కంపెనీకి చెందిన వేర్‌హౌస్ నెట్‌వర్క్‌లో ఉపయోగించే వేర్‌హౌస్ రోబోట్లు, ఆటోమేషన్ సిస్టమ్‌లను రూపొందించే టీమ్స్‌లోని ఉద్యోగులపై వేటు పడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి లేఆఫ్స్ ప్రక్రియ చేపట్టింది. ఈ ఏడాది జనవరిలో 16 వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన కంపెనీ, తాజాగా రోబోటిక్స్ యూనిట్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. దాదాపు 100 మంది వైట్‌కాలర్ ఉద్యోగులపై దీని ప్రభావం ఉండొచ్చని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. తాజా తొలగింపులు కంపెనీకి చెందిన వేర్‌హౌస్ నెట్‌వర్క్‌లో ఉపయోగించే వేర్‌హౌస్ రోబోట్లు, ఆటోమేషన్ సిస్టమ్‌లను రూపొందించే టీమ్స్‌లోని ఉద్యోగులపై వేటు పడింది. వీరు వేర్‌హౌస్‌లో పనులను ఆటోమేట్ చేసే రోబోలను డిజైన్ చేస్తారు. గతేడాది కంపెనీ వేర్‌హౌస్ ఉద్యోగులకు సహాయంగా బ్లూజే రోబోటిక్ విభాగాన్ని లాంచ్ చేసింది. కానీ, ఈ ప్రక్రియకు ఎక్కువ ఖర్చు అవుతుందనే కారణంతో అమెజాన్ వీటి తయారీని ఆపేసింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి ఈ విభాగంలో సమీక్ష చేపడతామని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. కానీ, ప్రస్తుతం ఎంతమందిని తొలగించిందనే విషయంపై అమెజాన్ స్పష్టత ఇవ్వలేదు. కాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం అత్యంత వేగంగా పెరగడంతో అమెజాన్ గతేడాది ఆఖర్లో 14 వేల మందిని, ఈ ఏడాది ప్రారంభంలో మరో 16 వేల మందిని తొలగించిన సంగతి తెలిసిందే.






