మెటా ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్‌గా అమన్ జైన్.. త్వరలోనే బాధ్యతల స్వీకరణ

by Kema Shiva Kumar |

ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram), వాట్సాప్ (WhatsApp) మాతృ సంస్థ మెటా (Meta) ఇండియాకు అమన్ జైన్ (Aman Jain)ను కొత్త పబ్లిక్ పాలసీ హెడ్‌గా నియమించారు.

మెటా ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్‌గా అమన్ జైన్.. త్వరలోనే బాధ్యతల స్వీకరణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram), వాట్సాప్ (WhatsApp) మాతృ సంస్థ మెటా (Meta) ఇండియాకు అమన్ జైన్ (Aman Jain)ను కొత్త పబ్లిక్ పాలసీ హెడ్‌గా నియమించారు. ఈ మేరకు 2026 జనవరి 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. ఏషియా పసిఫిక్ పాలసీ వై ఫిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ సైమన్ మిల్నర్‌కు అమన్ జైన్ రిపోర్ట్ చేస్తారు. కాగా, అమన్ గతంలో అమెజాన్‌లో రెండేళ్లు పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు గూగుల్‌లో ఏడేళ్లకు పైగా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. భారత్‌లో డేటా ప్రైవసీ, ఏఐ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన కొత్త నిబంధనలు రూపొందుతున్న నేపథ్యంలో మెటా ఇండియాలో అమన్ జైన్‌ను పబ్లిక్ పాలసీ హెడ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అదే స్థానంలో బాధ్యతలు నిర్వహించిన శివనాథ్ ఠుక్రాల్ (Shivnath Thukral) గత జూన్‌లో ఫోన్‌పే సంస్థలో చేరారు.

Next Story