Jio-Allianz: జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, అలియాంజ్

by S Gopi |   (  Updated:2026-04-22 17:22:35  IST  )

దీనికి సంబంధించి బుధవారం ఇరు సంస్థలు ఒప్పందంపై సంతకాలు చేశాయి.

Jio-Allianz: జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, అలియాంజ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బీమా రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, అలియాంజ్ గ్రూప్ సంయుక్తంగా 50:50 నిష్పత్తిలో కొత్త జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. దీనికి సంబంధించి బుధవారం ఇరు సంస్థలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ భాగస్వామ్యాన్ని 2025, జూలైలోనే ప్రకటించగా, ఇప్పుడు అధికారికంగా అమల్లోకి వచ్చింది. సంబంధిత నియంత్రణ సంస్థల అనుమతులు వచ్చిన తర్వాత ఈ కొత్త సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ జాయింట్ వెంచర్ ద్వారా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విస్తృత డిజిటల్ నెట్‌వర్క్, పంపిణీ సామర్థ్యాన్ని, గ్లోబల్ బీమా నైపుణ్యం ఉన్న అలియాంజ్ కలిపి వ్యక్తులు, చిన్న వ్యాపారాలు, పెద్ద సంస్థలకు అందుబాటులో ఉండే బీమా ఉత్పత్తులను అందించనున్నారు. ముఖ్యంగా హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ రంగాల్లో కొత్త పరిష్కారాలు తీసుకురావాలని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రధానంగా ఈ భాగస్వామ్యం ద్వారా '2047 నాటికి అందరికీ బీమా' అనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాధిస్తామని కంపెనీ తెలిపాయి. దేశంలో పెరుగుతున్న మధ్యతరగతి, యువత కారణంగా బీమా అవసరం వేగంగా పెరుగుతోంది. అందుకోసం దేశంలోని ప్రతి భారతీయుడికి ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా ఉన్నామని కంపెనీ పేర్కొన్నాయి.

Read More..

Jio-Allianz: జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, అలియాంజ్

Next Story