GST : వసూళ్ళలో ఆల్ టైం రికార్డ్

by Muthe.Rajitha |   (  Updated:2025-05-01 10:28:16  IST  )

భారత్ లో జీఎస్టీ(GST) వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డ్ నమోదైంది.

GST : వసూళ్ళలో ఆల్ టైం రికార్డ్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ లో జీఎస్టీ(GST) వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డ్ నమోదైంది. ఏప్రిల్ నెల(April Month)లో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. గత ఒక్క నెలలో రూ.2.37 లక్షల కోట్ల గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ వసూలు అయింది. అయితే గత ఏడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ వసూళ్లు 12.6 శాతానికి పెరిగినట్టు వెల్లడించారు. 2017 జులై 1న జీఎస్టీ ప్రవేశ పెట్టినప్పటి నుంచే ఇదే ఆల్ టైమ్ రికార్డుగా తెలియ జేశారు. అయితే దేశీయ లావాదేవీల్లో పెరుగుదలలు, దిగుమతులపై పన్ను పెంపు, ఆర్థిక వృద్ధి, మెరుగైన పన్ను వసూళ్ల సామర్థ్యం, కఠినమైన పన్ను ఎగవేత నిరోధక చర్యలు వంటివి ఈ వసూళ్లకు కారణమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక మార్చిలో రూ.1.96 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అయింది.

Next Story