Bypass surgery: తెలంగాణ, ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..ఈ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె బైపాస్ సర్జర్జీ రూ. 30000 మాత్రమే..? ఎక్కడంటే..?

by Vennela |

Bypass surgery: ప్రస్తుత కాలంలో వైద్యం అనేది ఎంతో ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది.

Bypass surgery: తెలంగాణ, ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..ఈ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె బైపాస్ సర్జర్జీ రూ. 30000 మాత్రమే..? ఎక్కడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: Bypass surgery: ప్రస్తుత కాలంలో వైద్యం అనేది ఎంతో ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో క్షేత్ర చికిత్సలకు లక్షలు ఖర్చవుతున్నాయి. ముఖ్యంగా పేద ప్రజలు ఇలాంటి చికిత్సలకు దూరమైపోతున్నారు. మన వైపు రాష్ట్ర ప్రభుత్వాలు జనరల్ ఆసుపత్రులను ఏర్పాటు చేసినప్పటికీ వాటిలో సదుపాయాలు పూర్తిస్థాయిలో ఉండటం లేదు.

దీంతోపాటు హెల్త్ స్కీములు ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో అవి కవరేజీ లభించడం లేదు. ఇలాంటి సందర్భంలో తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చేలా AIIMS - All India Institute of Medical Sciences వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణలో భువనగిరి జిల్లా బీబీనగర్ లో ఎయిమ్స్ వైద్యశాల ఏర్పాటు చేయగా, ఏపీలోని గుంటూరు జిల్లాలో మంగళగిరిలో ఎయిమ్స్ వైద్యశాలను ఏర్పాటు చేశారు.

ఈ వైద్యశాలలో పేద మధ్యతరగతి కుటుంబాలకు అతి తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన వైద్యం లభిస్తుంది. కార్పొరేట్ వైద్యానికి దీటుగా ఎయిమ్స్ వైద్యశాలలో వైద్య చికిత్సలు లభిస్తున్నాయి. ముఖ్యంగా గుండెకు సంబంధించిన చికిత్సలు ఉదాహరణకు బైపాస్ సర్జరీ, వాల్వ్ రీప్లేస్‌మెంట్, పిల్లల జన్మజనిత గుండె లోపాల శస్త్రచికిత్సలు ఎయిమ్స్ లో అందుబాటులో ఉన్నాయి.

బయట కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రులతో పోల్చి చూస్తే ఎయిమ్స్ లో ఆపరేషన్లకు అయ్యే ఖర్చు చాలా తక్కువ ఉదాహరణకు ఒక బైపాస్ సర్జరీ కార్పొరేట్ ఆసుపత్రిలో చేయించుకుంటే మూడు లక్షల వరకు ఖర్చవుతుంది అదే ఎయిమ్స్ వైద్యశాలలో చేయించుకుంటే ప్రభుత్వ నిబంధనలతో పాటు ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు అందుబాటులో ఉంటాయి తద్వారా ఇక్కడ ఉచితంగా కూడా చేయించుకోవచ్చు. ఎయిమ్స్ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్లకు అయ్యే ఖర్చు కేవలం 20 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయలు మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలో అత్యంత ముఖ్యమైనది. CABG - Coronary Artery Bypass Grafting (బైపాస్ సర్జరీ) గుండె నాళాల్లో బ్లాకులు ఉన్నవారికి చేసే ఈ శస్త్ర చికిత్స ఖర్చు ఎయిమ్స్ లో సుమారు 30 వేల నుంచి 50 వేల రూపాయలు మాత్రమే. ఇక Heart Valve Replacement (హార్ట్ వాల్వ్ మార్పిడి) శస్త్ర చికిత్సకు అయ్యే ఖర్చు కేవలం 40,000 నుంచి 60 వేల రూపాయలు మాత్రమే.

Pediatric Cardiac Surgery (పిల్లల గుండె ఆపరేషన్) అయ్యే ఖర్చు సుమారు రూ. 20,000 నుంచి రూ. 40,000 మాత్రమే. .Angioplasty with Stent (అంజియోప్లాస్టీ) గుండె నాళాల్లో స్టంట్ వేసే ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా వేసే ఒక్కో స్టెంట్ కోసం సాధారణంగా రూ. 20,000 – 30,000 ఖర్చవుతుంది.

Next Story