PNB కస్టమర్లకు అలర్ట్.. ఈనెల 15 తర్వాత ఆ ఖాతాలు క్లోజ్!

by velandi.Saikiran |

ఈ నెల 16వ తేదీ నుంచి ట్రాన్సాక్షన్ జరగని ఖాతాలను క్లోజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది PNB.

PNB కస్టమర్లకు అలర్ట్.. ఈనెల 15 తర్వాత ఆ ఖాతాలు క్లోజ్!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. మూడు సంవత్సరాలుగా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరపని ఖాతాలు, జీరో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ల‌ను క్లోజ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ నెల 16వ తేదీ నుంచి ట్రాన్సాక్షన్ జరగని ఖాతాలను క్లోజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఖాతాలు ఇనాక్టివ్ గా ఉండటం వల్ల మోసాలు జరిగే ప్రమాదం పొంచి ఉందని ఈ సందర్భంగా వెల్లడించింది. ఒకవేళ వినియోగదారులు తమ అకౌంట్లు కొనసాగించాలని కుంటే ఈ నెల 15వ తేదీలోపు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని సూచనలు చేసింది. దాంతో పాటు మనీ ట్రాన్జక్షన్స్ కూడా రెగ్యులర్ గా చేయాలని కోరింది. లేకపోతే ఖాతాలు మాత్రం క్లోజ్ చేయడం పక్కా అని వెల్లడించింది.

Next Story