Bank Account: బ్యాంక్‌ ఖాతాదారులకు అలెర్ట్.. RBI కీలక ప్రకటన

by Vennela |

Bank Account: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది.

Bank Account: బ్యాంక్‌ ఖాతాదారులకు అలెర్ట్.. RBI కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: Bank Account: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. బ్యాంకుల్లో యాక్టివ్ గా ఉన్న అన్ని బ్యాంకు ఖాతాదారుల వివరాలతోపాటు వారి నామినీలను జోడించాలని ఆదేశించింది.ప్రస్తుతం ఉన్న ఖాతాదారులు, కొత్తగా ఖాతా తెరవబోయే వారందరికీ ఇది వర్తిస్తుందని ఆర్బిఐ తెలిపింది.

దేశంలో చాలా మంది ప్రజలు తమ ఆర్థిక అవసరాల కోసం బ్యాంకు అకౌంట్స్(Bank Account) ఉపయోగిస్తుంటారు. బ్యాంకు అకౌంట్ లేకుండా నగదు ట్రాన్సాక్షన్స్ చేయలేని పరిస్ధితిలో ఉన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బ్యాంకు అకౌంట్ తెరిచే ఛాన్స్ కల్పించింది. సాధారణంగా బ్యాంకు అకౌంట్లు అందరికీ ముఖ్యమైనవి. దీంతో రీసెర్చ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. ఇది ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతాదారులు, కొత్త ఖాతా తెరిచే వారందరికీ వర్తిస్తుందని చెప్పారు. ఈ దశలో బ్యాంకు ఖాతాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) జారీ చేసిన ముఖ్యమైన నోటిఫికేషన్ ఏంటో చూద్దాం.

బ్యాంక్ అకౌంట్స్(Bank Account) కు సంబంధించి ఆర్బిఐ(RBI) ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాతాదారులు తమ బ్యాంకుల్లోని అన్ని అకౌంట్లో నామినీలను చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది సేవింగ్స్ అకౌంట్స్(Savings Accounts) నుంచి ప్రారంభించి బ్యాంకులు నిర్వహించే అన్ని ఖాతాలను ఉపయోగించే ఖాతాదారులు తప్పనిసరిగా నామినీ(Nominee)లను జోడించాలని పేర్కొంది. ఈ కొత్త నిబంధన కొత్త బ్యాంక్ అకౌంట్స్ తెరిచే కస్టమర్లకే కాదు ఇప్పటికే బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగిస్తున్ను కస్టమర్లకు కూడా వర్తిస్తుంది.

ఆర్బిఐ ఈ విషయాన్ని తెలియజేసి, నామినీలను ఇప్పటికే వాడుకలో ఉన్న బ్యాంకు అకౌంట్లో చేర్చలేదని వెల్లడించింది. ఈ సందర్బంలో ఖాతాదారులు మరణిస్తే..వారి కుటుంబ సభ్యులు డబ్బును విత్ డ్రా చేసుకునే సమస్యను ఎదుర్కొవల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఖాతాదారులు తమ బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బు ఎవరికీ వారి తర్వాత అందాల్సిన వారసుడిని నియమించకపోవడమే దీని కారణం.

బ్యాంకుల్లో యాక్టివ్ గా ఉన్న అన్ని బ్యాంకులు ఖాతాదారుల వివరానలు వారి నామినీ(Nominee)లను జోడించాల్సి ఉంటుంది. ప్రస్తుం ఉన్న ఖాతాదారులు, కొత్తగా ఖాతా తీసుకోబోయే వారందరికీ ఇది వర్తిస్తుందని ఆర్బిఐ తెలిపింది.

Next Story