- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Alert: ఆ బ్యాంకు కస్టమర్ల బిగ్ అలర్ట్.. ఈ సమయాల్లో UPI సేవలు పనిచేయవు
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్స్‌కే (Digital payments) ప్రాధాన్యత ఇస్తున్నారు. కిరాణ కొట్టులో ఒక్క రూపాయి చాక్లెట్ దగ్గర నుంచి షాపింగ్ మాల్స్‌లో లక్ష రూపాయల ట్రాన్సాక్షన్ వరకు అందరూ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలను వినియోగిస్తున్నారు. ఇందుకోసం గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం (Gpay, Phone pay, Paytm) వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తారు. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC.. యూపీఐ (UPI) పేమెంట్స్‌కు సంబంధించి తన ఖాతాదారులకు కీలక ప్రకటన జారీ చేసింది. సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా.. బ్యాంక్ యూపీఐ సేవలకు స్వల్ప అంతరాయం కలుగుతుందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 8వ తేదీన HDFC బ్యాంక్ UPI సేవలకు మూడు గంటల పాటు పనిచేయవు. అంటే.. శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి మరుసటి తెల్లవారుజామున 3 గంటల వరకు యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ డౌన్ టైమ్లో HDFC బ్యాంక్ ఖాతాలు, RuPay క్రెడిట్ కార్డ్‌లు, HDFC మొబైల్ బ్యాంకింగ్ యాప్, TPAPలలో UPI లావాదేవీలు పనిచేయవు. అవసరమైన లావాదేవీలను ముందుగానే పూర్తి చేయాలని కస్టమర్‌లకు బ్యాంకు అధికారులు సూచించారు. అయితే అర్ధరాత్రి సమయం కావడంతో ఆ సమయంలో తక్కువగా ఆర్థిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంటుంది.
కాగా, ఇటీవల కాలంలో యూపీఐ సర్వీసులు పెద్ద ఎత్తున విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని RBI హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఎస్ఎంఎస్ రూపంలో కానీ , ఫిషింగ్ మెయిల్స్ ద్వారా కానీ అగంతకులు మీ అకౌంట్‌లో డబ్బులు కొట్టేసే వీలుందని, అనధికారిక వెబ్ సైట్లలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేయకూడదని సూచించింది.






