వార్షికోత్సవం సందర్భంగా ఆఫర్లు ప్రకటించిన ఆకాశ ఎయిర్, ఇండిగో!

by Disha Web Desk 17 |
వార్షికోత్సవం సందర్భంగా ఆఫర్లు ప్రకటించిన ఆకాశ ఎయిర్, ఇండిగో!
X

న్యూఢిల్లీ: కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తన విమానయాన సేవల కార్యకలాపాలు ప్రారంభమై ఏడాది పూర్తయిన నేపథ్యంలో సంస్థ ప్రత్యేక రాయితీ, యాప్-ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లను ప్రకటించింది. ఆకాశ ఎయిర్ యాప్, వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకున్న తర్వాత సంస్థ నెట్‌వర్క్‌లోని 16 దేశీయ రూట్లకు చెందిన టికెట్లపై 15 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్ ఆగస్టు 7వ తేదీ వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది.

వినియోగదారులు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో 'ఆకాశ1', యాప్‌లో 'యాప్‌లవ్' కోడ్‌లను ఉపయోగించి డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా యాప్‌లో బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణీకులు జీరో కన్వినియన్స్ ఫీజును పొందవచ్చని, ప్రతి బుకింగ్‌పై అదనంగా రూ. 350 ఆదా చేసుకోవచ్చని కంపెనీ బుధవారం ప్రకటనలో తెలిపింది.

కార్యకలాపాలు ప్రారంభమైన ఏడాదిలోనే ఆకాశ ఎయిర్ 40 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. 16 నగరాల మధ్య 35 ప్రత్యేక రూట్లలో విమానాలను నడుపుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. మరో విమానయాన సంస్థ ఇండిగో సైతం తన 17వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 2 నుంచి ఆగస్టు 4 మధ్య ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది.

'హ్యాపీ ఇండిగో డే' పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్ ద్వారా మొబైల్ యాప్ నుంచి 3 వరకు బుకింగ్ చేసుకునే టికెట్లపై 12 శాతం తగ్గింపు, 4న బుకింగ్ చేసుకునే వాటిపై 7 శాతం తగ్గింపు ఇచ్చింది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డు ఉన్నవారికి కనిష్ట ఆర్డర్ రూ. 5,000పై రూ. 2 వేల వరకు, అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చని తెలిపింది. హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డు ఉన్నవారికి అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.

Next Story

Most Viewed