Akasa Air: ఆకాసా ఎయిర్ కో-ఫౌండర్ ప్రవీణ్ అయ్యర్ రాజీనామా

by S Gopi |

దీంతో ఆకాసా ఎయిర్ నుంచి నిష్క్రమించిన రెండో కో-ఫౌండర్ ప్రవీణ్ అయ్యర్ నిలిచారు.

Akasa Air: ఆకాసా ఎయిర్ కో-ఫౌండర్ ప్రవీణ్ అయ్యర్ రాజీనామా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఆకాసా ఎయిర్ కో-ఫౌండర్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ రాజీనా చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ ఆఖరులో ఆయన సంస్థను వీడుతున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడిచింది. దీంతో ఆకాసా ఎయిర్ నుంచి నిష్క్రమించిన రెండో కో-ఫౌండర్ ప్రవీణ్ అయ్యర్ నిలిచారు. గతేడాది అక్టోబర్‌లో సంస్థ మరో కో-ఫౌండర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్(ఇంటర్నేషన్ ఆపరేషన్స్) నీలు ఖత్రి సంస్థను వీడిన సంగతి తెలిసిందే. ఎయిర్‌లైన్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన ఖత్రి, ఆకార్ ఎయిర్‌ అంతర్జాతీయ కార్యకలాపాలను నిర్మించడం, విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. 2025లో సంస్థలోని సీనియర్ మేనేజ్‌మెంట్ మధ్య గందరగోళం తర్వాత కో-ఫౌండర్లు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. 2025, జూన్‌లో వైస్ ప్రెసిడెంట్ (ఇన్-ఫ్లైట్ సర్వీసెస్) అజిత్ భగ్‌చందాని వ్యక్తిగత కారణాలను చూపుతూ రాజీనామా చేశారు. మే నాటికి, లాంగ్-టర్మ్ ఆపరేషన్స్, స్ట్రాటజీ, ఎక్సలెన్స్ అండ్ ప్లానింగ్ హెడ్ రిషబ్ దేవ్, వైస్ ప్రెసిడెంట్ (ఎయిర్‌క్రాఫ్ట్ అక్విజిషన్ అండ్ లీజింగ్) అమోల్ మానే సహా పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామా చేశారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ (క్యాటరింగ్) వినీత్ మిశ్రా కూడా గత ఏడాది మే నెలలో మరో క్యారియర్‌లో చేరేందుకు వెళ్లిపోయారు. కో-ఫౌండర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆనంద్ శ్రీనివాసన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని అకాసా ప్రకటించింది.

Next Story