Airtel: స్పామ్ మోసాల కట్టడికి ఓటీటీలపై చర్యలు

by S Gopi |
Airtel: స్పామ్ మోసాల కట్టడికి ఓటీటీలపై చర్యలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెలికాం నెట్‌వర్క్‌లలో వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఓవర్-ది-టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జరిగే స్పామ్, ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ట్రాయ్ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ కోరింది. దీనికోసం డేటా స్క్రబ్బింగ్, యూజర్ వెరిఫికేషన్ వంటి తక్షణ చర్యలను వేగవంతం చేయాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లాహోటీకి రాసిన లేఖలో పేర్కొంది. స్పామ్, మోసపూరిత మెసేజ్‌లు ఇకపై కేవలం ఎస్ఎంఎస్, వాయిస్ కాల్స్‌కు మాత్రమే పరిమితం కావు. మెయిన్‌లైన్ మార్కెటింగ్, బిజినెస్ కమ్యూనికేషన్‌ల కోసం ఎక్కువగా ఉపయోగించే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ స్పామ్ జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని ఎయిర్‌టెల్ హెచ్చరించింది. బ్లాక్‌చెయిన్-ఆధారిత డిస్ట్రిబ్యూటర్-లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్‌టీ)ని ఉపయోగించి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కోసం డేటా స్క్రబ్బింగ్‌ను అత్యవసరంగా తప్పనిసరి చేయాలని, టెలికాం కేవైసీతో కూడిన కఠినమైన ధృవీకరణ జరగాలని అభిప్రాయపడింది. అలాగే, బ్లాక్‌లిస్ట్ చేసిన స్పామ్ డేటాబేస్‌ను టెలికాం కంపెనీలతో పంచుకోవడాన్ని ఓటీటీలకు తప్పనిసరి చేయాలి. స్పామ్ మోసాలకు పాల్పడే వారిని కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ల మధ్య మారకుండా నిరోధించే యాంటీ-స్పామ్ ఎకోసిస్టమ్‌ను రూపొందించాలని సూచించింది. స్పామ్ మోసాలు పెరగకుండా ఎదుర్కోవడానికి ఓటీటీలను నియంత్రించాలని ఎయిర్‌టెల్ ట్రాయ్‌ని విజ్ఞప్తి చేసింది.

Advertisement

Next Story

Most Viewed