- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Airtel: ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్‌తో భారతీ ఎయిర్‌టెల్ జట్టు
పరస్పరం సహకారం పొందే అంశాలపై ఇరు సంస్థలు ఒప్పందంలో పేర్కొన్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీ ఎయిర్‌టెల్ భారత్‌లో స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను పరిచయం చేయడానికి స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అయితే, ఒప్పందం ప్రకారం దేశంలో స్టార్‌లింక్ సేవలను విక్రయించడానికి స్పేస్ఎక్స్ ప్రభుత్వ నియంత్రణ ఆమోదాలకు లోబడి ఉండనుంది. పరస్పరం సహకారం పొందే అంశాలపై ఇరు సంస్థలు ఒప్పందంలో పేర్కొన్నాయి. ఈ భాగస్వామ్యంతో.. ఎయిర్‌టెల్, స్పేస్ఎక్స్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించేందుకు కలిసి పనిచేయనున్నాయి. ఎయిర్‌టెల్ రిటైల్ స్టోర్‌లలో స్టార్‌లింక్ పరికరాలను లభించనున్నాయి. వ్యాపార అవసరాలకు స్టార్‌లింక్ హై-స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ లభిస్తుంది. గ్రామీణ పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, రిమోట్ కమ్యూనిటీలకు విశ్వసనీయ ఇంటర్నెట్ సదుపాయాన్ని తీసుకురావడానికి రెండు కంపెనీలు కలిసి పని చేస్తాయి. అంత్కాకుందా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ విస్తరణ,నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు స్టార్‌లింక్ సహకరిస్తుంది. దీనికోసం ఎయిర్‌టెల్ మౌలిక సదుపాయాలను స్టార్‌లింక్ ఉపయోగించుకుంటుంది. ఎయిర్‌టెల్‌తో కలిసి పని చేయడానికి, స్టార్‌లింక్ సేవలను భారత్‌లో అందించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్ గ్వైన్ షాట్‌వెల్ పేర్కొన్నారు.






