Airtel: పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంచిన ఎయిర్‌టెల్

by S Gopi |   (  Updated:2026-04-20 13:43:38  IST  )

ఎవరికీ తెలియకుండా రూ. 799 ప్లాన్‌ను తొలగించడమే కాకుండా, మరో ప్లాన్ రూ. 859 ధరను అమాంతం పెంచేసింది.

Airtel: పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంచిన ఎయిర్‌టెల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్ ఇచ్చింది. పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లలో కంపెనీ భారీ మార్పులు చేసింది. ఎవరికీ తెలియకుండా రూ. 799 ప్లాన్‌ను తొలగించడమే కాకుండా, మరో ప్లాన్ రూ. 859 ధరను అమాంతం పెంచేసింది. రూ. 40 పెంచడంతో ఈ ప్లాన్ ఇప్పుడు రూ. 899కి చేరింది. అయితే, ఈ ప్లాన్ ప్రయోజనాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ హైస్పీడ్‌ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌, 100 ఎస్సెమ్మెస్‌, ఎయిర్‌టెల్‌ ఫ్రీ హలోట్యూన్‌ బెనిఫిట్స్‌ లభిస్తాయి. అయితే, ఇది వరకు రూ. 859గా ఉన్న ఈ ప్లాన్‌లో రివార్డ్‌మిని సబ్‌స్క్రిప్షన్(అదనపు ఖర్చు లేకుండా నెలకు రూ. 80 క్యాష్‌బ్యాక్) సదుపాయం ఉండేది. ఈ ప్లాన్ వద్దనుకునే యూజర్లకు 84 రోజుల వ్యాలిడిటీతోనే రూ. 1,029 ఉంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2జీబీ డేటా పొందవచ్చు. ధరను పెంచడంతో పాటు రూ. 799 ప్లాన్‌ను తొలగించడానికి సంబంధించి ఎయిర్‌టెల్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయం(ఆర్పు) పెంచే ఉద్దేశంతో ఈ మార్పు చేసి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story