- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Airtel: వ్యాలిడిటీ పొడిగింపు కోసం ఉపయోగపడే ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జీ ప్లాన్
ఈ ప్లాన్, కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్, మరికొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కొత్త ప్రీప్యిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.189 ధర ప్రవేశపెట్టిన ఈ ప్లాన్, కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్, మరికొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 21 రొజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు 1జీబీ డేటా, 300 మెసేజ్‌లు లభిస్తాయి. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్, యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవడానికి వీలుంటుంది. రూ.200 కంటే తక్కువ ధరకు బేసిక్, స్వల్పకాలానికి వ్యాలిడిటీ పొడిగించుకునేందుకు చూస్తున్న వినియోగదారులకు ఇది ప్రయోజనకరం. ముఖ్యంగా ఖరీదైన డేటా ప్యాక్‌లతో రీఛార్జ్ చేయకుండా తమ మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ ద్వార సగటు ఆదాయాన్ని (ఆర్పు) పెంచడానికి, తక్కువ ఖర్చు చేసే కస్టమర్‌లను నిలుపుకోవడానికి ప్రయనిస్తోంది. వాస్తవానికి, రూ.189 ప్లాన్ సెకండరీ సిమ్ వినియోగదారులు లేదా సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాలలోని చిన్న స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ప్రారంభించింది.






