- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Airtel: ఎయిర్‌టెల్ కస్టమర్లకు యాపిల్ టీవీ ప్లస్ సేవలు
దీనికోసం కస్టమర్లు రూ. 999 అంతకంతే ఎక్కువ ఖరీదైన ప్లాన్‌లను ఎంచుకోవాలి.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రైవేట్ రంగ టెలికా సంస్థ సోమవారం టెక్ దిగ్గజం యాపిల్‌తో కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. తన సబ్‌స్క్రైబర్లకు మెరుగైన కంటెంట్ సేవలు అందించేందుకు హోమ్ వైఫై, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ మ్యూజిక్ సర్వీసెస్ లభిస్తాయని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. దీనికోసం కస్టమర్లు రూ. 999 అంతకంతే ఎక్కువ ఖరీదైన ప్లాన్‌లను ఎంచుకోవాలి. తద్వారా వైఫై యూజర్లు అయితే యాపిల్ టీవీ ప్లస్ కంటెంట్‌ను, పోస్ట్ పెయిడ్ వినియోగదారులు ఈ ప్లాన్‌ల ద్వారా యాపిల్ టీవీ ప్లస్ కంటెంట్‌తో పాటు అదనంగా 6 నెలలు ఉచిత యాపిల్ మ్యూజిక్ పొందవచ్చు. రూ. 999తో పాటు రూ. 1,099, రూ. 1,599, రూ. 3,999 హోమ్ వైఫై ప్లాన్‌లలో ఈ సర్వీసెస్ పొందవచ్చు. అలాగే, పోస్ట్‌పెయిడ్ యూజర్లు రూ. 999తో పాటు రూ. 1,199, రూ. 1,399, రూ. 1,749 ప్లాన్‌లలో యాపిల్ టీవీ ప్లస్ సేవలు లభిస్తాయి.






