DTH: డీటీహెచ్ వ్యాపార విలీన చర్చలను నిలిపేసిన ఎయిర్‌టెల్, టాటా గ్రూప్

by S Gopi |

చర్చలు నిలిపేసినట్టు భారతీ ఎయిర్‌టెల్ అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

DTH: డీటీహెచ్ వ్యాపార విలీన చర్చలను నిలిపేసిన ఎయిర్‌టెల్, టాటా గ్రూప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ప్రారంభంలో కంటెంట్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ టాటా ప్లే, భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన డిజిటల్ టీవీ విలీనం కానున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. డీటీహెచ్ వ్యాపారంలో తగ్గుతున్న ఆదాయం కారణంగా ఇరు సంస్థలు విలీన నిర్ణయానికి వచ్చాయి. దీనికోసం ఇరు సంస్థలు చర్చలు కూడా మొదలుపెట్టాయి. తాజాగా ఈ విషయంలో ఎలాంటి పురోగతి జరగలేదని, విలీనానికి సంబంధించి చర్చలు నిలిపేసినట్టు భారతీ ఎయిర్‌టెల్ అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. విలీన ప్రక్రియలో రెండు కంపెనీలు సంతృప్తికరంగా లేవని, ఏకాభిప్రాయానికి రాని కారణంగా ఇంతటితో చర్చలు ముగించాలని నిర్ణయించామని ఎయిర్‌టెల్ వివరించింది. భారత్‌లో అతిపెద్ద డీటీహెచ్‌ ప్రొవైడర్‌గా టాటా స్కై కొనసాగుతోంది. ఈ సంస్థ టాటా సన్స్, 21 సెంచురీ ఫాక్స్ మధ్య ఏర్పాటైన జీయింట్ వెంచర్. 2004లో ప్రారంభమైన ఈ సంస్థ కార్యకలాపాలు, 2022లో కంపెనీ పేరును టాటా ప్లేగా మార్చారు. కాగా, ఇప్పటికే 2016లో టాటా డీ2హెచ్‌, డిష్‌ టీవీ మధ్య విలీనం ఈ విభాగంలో అతిపెద్ద ఒప్పందంగా ఉంది.

Next Story