- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Airlines: ఎయిర్‌లైన్ కంపెనీల నష్టాలు రూ. 5,290 కోట్లు
దేశంలోని మొత్తం 11 ఆపరేటర్లలో, ఇండిగో, బ్లూ డార్ట్, స్టార్ ఎయిర్, ఇండియావన్ ఎయిర్ సంస్థలు మాత్రమే లాభాలను చూశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమానయాన సంస్థలు మొత్తం రూ. 5,289.73 కోట్ల నష్టాలను నమోదు చేశాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో ఎయిర్ఇండియా గ్రూప్ మాత్రమే రూ. 9,808.12 కోట్ల నష్టాలను చూసిందని అధికారిక గణాంకాలు వెళ్లడించాయి. దేశంలోని మొత్తం 11 ఆపరేటర్లలో, ఇండిగో, బ్లూ డార్ట్, స్టార్ ఎయిర్, ఇండియావన్ ఎయిర్ సంస్థలు మాత్రమే లాభాలను చూశాయి. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ సోమవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో దీనికి సంబంధించిన డేటాను అందించారు. దీని ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వరుసగా రూ. 3,975.75 కోట్లు, రూ. 5,832.37 కోట్ల నష్టాన్ని నమోదు చేయగా, అకాసా ఎయిర్ రూ. 1,986.25 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన అలయన్స్ ఎయిర్ రూ. 691.12 కోట్లు నష్టపోగా, స్పైస్‌జెట్ నష్టం రూ. 55.67 కోట్లుగా ఉంది. ఇతర ఎయిర్‌లైన్స్‌లో ఫ్లై91 (రూ. 67.65 కోట్లు), క్విక్‌జెట్ కార్గో (రూ. 1.34 కోట్లు) నష్టపోయాయి. అయితే, ఇండిగో రూ. 7,253.30 కోట్ల లాభాన్ని ఆర్జించగా, ఇతర సంస్థలు స్టార్ ఎయిర్ (రూ. 68.75 కోట్లు), బ్లూ డార్ట్ (రూ. 0.71 కోట్లు), ఇండియావన్ ఎయిర్ (రూ. 0.33 కోట్లు) లాభాలు చూశాయి.






