Air India: ఎయిర్ఇండియాకు రూ. 22,000 కోట్ల నష్టాలు

by S Gopi |

దీన్నుంచి బయటపడేందుకు కంపెనీ వాటాదారులుగా ఉన్న సింగపూర్ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్‌లను ఆర్థిక సాయం కోసం కోరినట్టు తెలుస్తోంది.

Air India: ఎయిర్ఇండియాకు రూ. 22,000 కోట్ల నష్టాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా ఊహించిన దానికంటే ఎక్కువ నష్టాలను చవిచూడనున్నట్టు సమాచారం. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ రూ. 22,000 కోట్ల మేర నష్టాలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. దీన్నుంచి బయటపడేందుకు కంపెనీ వాటాదారులుగా ఉన్న సింగపూర్ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్‌లను ఆర్థిక సాయం కోసం కోరినట్టు తెలుస్తోంది. గతేడాది బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ప్రమాదం, పాకిస్తాన్ గగనతల మూసివేత, ఈ ఏడాది పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల అనేక ఇంటర్నేషనల్ రూట్లలో సంస్థ విమానాలను నడపలేదు. ఇవి సంస్థ కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఎయిర్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని లాభదాయకంగా ప్రారంభించినా, తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. పాకిస్తాన్ గగనతల మూసివేతతో విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చి ఖర్చులు పెరిగాయి. జూన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంతో కొన్ని అంతర్జాతీయ, దేశీయ సర్వీసులను తగ్గించాల్సి వచ్చింది. అమెరికా విధించిన సుంకాలు, వీసా పరిమితులు కూడా కంపెనీ ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపాయి. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ఇండియాకు అత్యవసర ఆర్థిక సహాయం అందించే విషయంపై చర్చలు జరుపుతున్నాయి. కానీ కంపెనీ భవిష్యత్ పనితీరు, లాభదాయకతపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.

Next Story