Air India: ఉద్యోగుల కోసం ఎయిర్ఇండియా ప్రత్యేక యాప్

by S Gopi |

పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, వారి కుటుంబాల కోసం ఒక ప్రత్యేకమైన యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Air India: ఉద్యోగుల కోసం ఎయిర్ఇండియా ప్రత్యేక యాప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జూన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత, టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, వారి కుటుంబాల కోసం ఒక ప్రత్యేకమైన యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ఉద్యోగుల భావోద్వేగ , మానసిక శ్రేయస్సు కోసం 600 కంటే ఎక్కువమంది నిపుణులతో కూడిన వన్-టు-వన్ థెరపీ, సైకియాట్రీ సెషన్‌లను అందిస్తుంది. అంతేకాకుండా, ఈ యాప్ రోజూవారి ఉద్యోగుల కార్యాచరణకు సంబంధించి రాసుకునేందుకు, మానసిక స్థితిని ట్రాక్ చేయడం, ఏఐ-ఆధారిత చాట్‌బాట్ మద్దతు లాంటి సాధనాలను కూడా అందించనున్నట్టు సంస్థ వెల్లడించింది. 260 మంది మరణించిన అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ఒకే రోజు (జూన్ 16) 112 మంది పైలట్లు అనారోగ్యానికి గురయ్యారని సంస్థ గుర్తించింది. ఇందులో 51 మంది కమాండర్లు, 61 మంది ఫస్ట్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో యాప్ ద్వారా, ఉద్యోగుల్లు తమ సౌకర్యానికి సరిపోయే ప్రొఫెషనల్‌తో వన్-టు-వన్ సెషన్‌లను బుక్ చేసుకోవచ్చు. గతంలోనూ విమాన సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో సహాయపడటానికి ప్రత్యేక శిక్షణను అందించాలని విమానయాన సంస్థలకు 2023లో డీజీసీఏ సర్క్యులర్ జారీ చేసింది.

Next Story