- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Air India: రూ. 1,950 నుంచే ఫ్లైట్ టికెట్ ..ప్రత్యేక సేల్ ప్రకటించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
బుకింగ్‌లు ఎయిర్‌లైన్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో, అన్ని ప్రధాన బుకింగ్ ఛానెళ్లలో 2026, జనవరి 1 వరకు అందుబాటులో ఉంటాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక సేల్ ప్రకటించింది. 'పేడే సేల్ ' పేరుతో తెచ్చిన ఈ ఆఫర్‌లో భాగంగా కంపెనీ దేశీయ రూట్లలో టికెట్ ధరలు రూ. 1,950 నుంచి, అంతర్జాతీయ రూట్లలో రూ. 5,990 నుంచి ఛార్జీలు మొదలవుతాయని తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక వివరాల ప్రకారం, ఈ ప్రత్యేక ఛార్జీలతో విమాన బుకింగ్‌లు ఎయిర్‌లైన్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో, అలాగే అన్ని ప్రధాన బుకింగ్ ఛానెళ్లలో 2026, జనవరి 1 వరకు అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా ప్రయాణికులు దేశీయ మార్గాలకు రూ. 1,850 నుంచి, అంతర్జాతీయ రూట్లకు రూ. 5,355 నుంచి ప్రారంభమయ్యే ఛార్జీలపై జీరో చెక్-ఇన్ బ్యాగేజీని బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక ఛార్జీలు దేశీయ ప్రయాణానికి వచ్చే ఏడాది జనవరి 12 నుంచి అక్టోబర్ 10 వరకు, అంతర్జాతీయ ప్రయాణానికి జనవరి 12 నుంచి అక్టోబర్ 31 వరకు చెల్లుబాటు అవుతాయని కంపెనీ వెల్లడించింది. లైట్ ఛార్జీలలో రాయితీతో కూడిన చెక్-ఇన్ బ్యాగేజీ ధరలు కూడా ఉన్నాయని ఎయిర్ ఇండియా తెలిపింది. దేశీయ విమానాలలో 15 కిలోలకు రూ. 1,500, అంతర్జాతీయ విమానాలలో 20 కిలోలకు రూ. 2,500 ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా చేసే అన్ని బుకింగ్‌లపై జీరో కన్వీనియన్స్ ఫీజును కూడా అందిస్తున్నట్టు వివరించింది. అంతేకాకుండా తరచూ ప్రయాణించే ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ లాయల్టీ సభ్యుల కోసం డీల్స్‌ను అందిస్తున్నామని, వీటిలో అత్యుత్తమ లెగ్‌రూమ్‌తో బిజినెస్ క్లాస్ ఛార్జీలపై 25 శాతం తగ్గింపు, కాంప్లిమెంటరీ 'గౌర్‌మెయిర్' హాట్ మీల్స్(అధిక నాణ్యత కలిగిన ఆహారం), అదనపు చెక్-ఇన్ బ్యాగేజీ అలవెన్స్, 'ఎక్స్‌ప్రెస్ అహెడ్' ప్రాధాన్యతా సేవలు లభిస్తాయని ఎయిర్ఇండియా పేర్కొంది.






