- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Air India: రూ. 1,279కే విమాన ప్రయాణం.. 'ఫ్రీడమ్ సేల్' ప్రకటించిన ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్
దేశీయ ప్రయాణాలకు రూ. 1,279, అంతర్జాతీయ రూట్లలో రూ. 4,279 నుంచి ప్రారంభం కానున్నాయి

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టాటా యాజమాన్యంలోని ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ భారీ ఆఫర్ ప్రకటించింది. భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విమానయాన సంస్థ 'ఫ్రీడమ్ సేల్ 'ను ఆదివారం ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా కంపెనీ దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ఫ్లైట్ టికెట్ ధరలను కేవలం రూ. 1,279కే అందించనున్నట్టు తెలిపింది. ఈ ధరలు మొదటి 50 లక్షల సీట్లకు అమలవుతాయని పేర్కొంది. ఈ ఆఫర్ ఆగష్టు 15వ తేదీలోపు బుక్ చేసుకున్నవారికి వర్తిస్తుందని ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ స్పష్టం చేసింది. బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది ఆగష్టు 19 నుంచి 2026, మార్చి 31 మధ్య ప్రయాణించవచ్చు. దేశీయ ప్రయాణాలకు రూ. 1,279, అంతర్జాతీయ రూట్లలో రూ. 4,279 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సేల్ భారత్‌లో స్వాతంత్ర్యానికి, కనెక్టివిటీ, యాక్సెసబిలిటీకి వేడుక లాంటిదని కంపెనీ పేర్కొంది. టికెట్లను బుక్ చేసుకునే కస్టమర్లు ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ నుంచి చేసుకోవచ్చని, ఆగష్టు 11-15 మధ్య అన్ని ప్రధాన బుకింగ్ ఛానెళ్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఈ ఏడాది పండుగ సీజన్ మొత్తం అందుబాటులో ఉంటుందని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. టికెట్ ధరలతో పాటు ఎక్స్‌ప్రెస్ లైట్, జీరో చెక్-ఇన్ బ్యాగేజీ ఛార్జీలలోనూ ఆఫర్లు వెబ్‌సైట్‌లో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.






