- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Air India: ఎయిర్ఇండియాకు రూ. 15,000 కోట్ల నష్టాలు
ఈ ఏడాది మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎయిర్ఇండియా కనీసం రూ. 15,000 కోట్ల (సుమారు 1.6 బిలియన్ డాలర్లు) నష్టాన్ని చూడొచ్చని అంచనా.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా భారీ నష్టాలను చూడనుంది. గతేడాది జరిగిన ఘోర విమాన ప్రమాదం, దీర్ఘకాలిక గగనతల ఆంక్షలు ఎయిర్‌లైన్స్ లాభాలను దెబ్బతీసిన తర్వాత, ఎయిర్ ఇండియా ఇప్పటివరకు ఎన్నడూ లేనంత అతిపెద్ద వార్షిక నష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయని బ్లూమ్‌బర్గ్ కథనం పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎయిర్ఇండియా కనీసం రూ. 15,000 కోట్ల (సుమారు 1.6 బిలియన్ డాలర్లు) నష్టాన్ని చూడొచ్చని అంచనా వేస్తున్నట్లు కొందరు తెలిపారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా సైనిక దాడి తర్వాత పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ విమానయాన సంస్థలకు మూసివేయడంతో ఆర్థిక దెబ్బ పెరిగింది. ఫలితంగా యూరప్, యూఎస్‌కు ఎక్కువ దూరం, ఖరీదైన రూట్లలో విమానాలను నడపాల్సి వచ్చింది. అంతకుముందు జూన్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోవడంతో 240 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. ఇది సంస్థకు అతిపెద్ద నష్టాన్ని కలిగించనుంది.
మొత్తంగా భారత విమానయాన రంగమే గత 12 నెలలుగా కష్టాల్లో ఉంది. ముఖ్యంగా వినియోగదారుల విశ్వాసం దెబ్బతినడం, వేలాదిగా విమాన అంతరాయాలు, పెద్ద సంఖ్యలో విమానాల రద్దుతో ఈ రంగంలో ఉన్న ఒకటి రెండు సంస్థ ఆధిపత్యంపై ఆందోళనలు చర్చకు వచ్చాయి. కంపెనీల ఆర్థిక గణాంకాలను చూసే టోఫ్లర్ ప్రకారం, ఎయిర్ ఇండియా గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 32,210 కోట్ల నష్టాలను నమోదు చేసింది. పెరుగుతున్న నష్టాలు యాజమాన్యాన్ని కలవరపెడుతున్నాయి. టాటా గ్రూప్ ఇప్పటికే ప్రస్తుత సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ స్థానంలో కొత్త వ్యక్తికి బాధ్యతలు ఇచ్చే ఆలోచనలో ఉంది.






