AirIndia: టిక్కెట్లపై ఎయిర్ఇండియా, ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇంధన సర్‌ఛార్జ్‌ బాదుడు

by S Gopi |

మార్చి 12 నుంచి ఈ రెండు కంపెనీలు టికెట్లపై రూ. 399 ఇంధన సర్‌ఛార్జ్ విధిస్తామని ప్రకటించాయి.

AirIndia: టిక్కెట్లపై ఎయిర్ఇండియా, ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇంధన సర్‌ఛార్జ్‌ బాదుడు
X

దిశ, బిజినెస్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం క్రమంగా పెరుగుతోంది. తాజాగా దేశీయ విమానయాన సంస్థలు ఎయిర్ఇండియా, ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇంధన కొరత నేపథ్యంలో దేశీయ విమాన టికెట్ల సర్‌ఛార్జ్ విధించేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి 12 నుంచి ఈ రెండు కంపెనీలు టికెట్లపై రూ. 399 ఇంధన సర్‌ఛార్జ్ విధిస్తామని ప్రకటించాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడం వల్ల అంతర్జాతీయ బుకింగ్‌లకు కూడా ఛార్జీలను పెంచుతామని తెలిపాయి. కొత్త ఇంధన సర్‌ఛార్జ్‌లను దశలవారీగా అమలు చేయనున్నారు. మొదటి దశలో, మార్చి 12 నుంచి దేశీయ విమాన టికెట్‌కు రూ. 399 ఇంధన సర్‌ఛార్జ్ ఉంటుందని, ఇది సార్క్ దేశాల విమానాలకు కూడా వర్తిస్తుందని కంపెనీలు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. పశ్చిమాసియా విమానాలకు ఇంధన సర్‌ఛార్జ్ 10 డాలర్లు, ఆఫ్రికా విమానాలకు 30 నుంచి 90 డాలర్ల వరకు, ఆగ్నేయాసియా సేవలకు 20 నుంచి 60 డాలర్ల వరకు పెరగనున్నాయి.

Next Story