- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AI: ఐదేళ్లలో ఐటీ, బీపీఓ ఉద్యోగాలను భర్తీ చేయనున్న ఏఐ
రాబోయే ఐదేళ్లలో అన్ని రకాల ఐటీ సేవలు భర్తీ అవుతాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేధస్సు(ఏఐ) అంతర్జాతీయంగా సేవల రంగంలో పెను మార్పులకు కారణమవుతుందని, సాంప్రదాయ ఐటీ, బీపీఓ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉందని ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా అన్నారు. అంతేకాకుండా ఏఐ-ఆధారిత ఆవిష్కరణల ద్వారా దేశీయంగా కొత్త జనరేషన్‌కు అనేక రకాల అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు. స్టార్టప్ పాలసీ ఫోరమ్ 'మీట్ ది ఓజీశ్ సిరీస్‌లో భారతీయ స్టార్టప్ వ్యవస్థాపకుల ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ.. అన్ని బీపీఓలు ఏఐతో భర్తీ అవుతాయి. రాబోయే ఐదేళ్లలో అన్ని రకాల ఐటీ సేవలు భర్తీ అవుతాయి. దీనివల్ల ప్రపంచంలోని ప్రతి కంపెనీ సగం మందితోనే పనిచేయగలదు. ఉత్పాదకత 5 శాతం నుంచి 500 శాతానికి మెరుగుపడుతుంది, దానివల్ల 80 శాతం మంది ఒకే ఉద్యోగం కోసం భర్తీ అవుతారని తెలిపారు. ఈ అంతరాన్ని అవకాశంగా మార్చుకోగల స్థానంలో భారత్ ఉంది. టెక్ ప్రతిభం, మరింత పురోగతికి సిద్ధంగా ఉండటం వంటి మార్గాలు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఏఐ తరంలో ఐటీ ఎగుమతులు, ఏఐ సేవల్లో ప్రపంచానికి కేంద్రంగా మారగదలని వినోద్ ఖోస్లా అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి భారత్ దేశీయంగా ఏఐని అమలు చేయాలని కూడా ఆయన కోరారు. ఈ రంగాలు ముఖ్యమైన సేవలను అందిస్తున్నాయి, ఏఐ ద్వారా మరింత సులభంగా సేవలందించవచ్చు, ఆధార్‌లో విలీనం చేయగలిగేంత సరసమైనవని, దేశవ్యాప్తంగా అందించగలిగే వీలుంటుందన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఏఐకి సామాజిక మౌలిక సదుపాయాలను మార్చగలిగే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.






