Sam Altman: ఏఐ వల్ల మొదట కోల్పోయేది కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలే: ఓపెన్ఏఐ శామ్ ఆల్ట్‌మాన్

by S Gopi |

దీనివల్ల ఏఐ ప్రభావంతో మొదట కోల్పోయేది ప్రోగ్రామింగ్, కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలేనని ఆల్ట్‌మన్ అన్నారు.

Sam Altman: ఏఐ వల్ల మొదట కోల్పోయేది కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలే: ఓపెన్ఏఐ శామ్ ఆల్ట్‌మాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం అత్యంత వేగంగా జరుగుతోంది. ఇదే సమయంలో ఈ టెక్నాలజీ కారణంగా చాలా రకాల ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తున్నాయి. దీనివల్ల ఏఐ ప్రభావంతో మొదట కోల్పోయేది ప్రోగ్రామింగ్, కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలేనని ఆల్ట్‌మన్ అన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఏఐ అంతర్జాతీయంగా ఉపాధి రంగంలో పెను మార్పులు తీసుకురానుంది. అందులోనూ ప్రోగ్రామింగ్, కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలకు ఎక్కువ ముప్పు ఉండే అవకాశం ఉంది.

అయితే, కంప్యూటర్ ప్రోగ్రామర్ లాంటి ఉద్యోగాలు భవిష్యత్తులో ఎలా మనుగడ సాగించగలవో చెప్పలేం. కానీ రెండేళ్ల క్రితం ఉన్న దాంతో పోలిస్తే ప్రోగ్రామర్ ఉద్యోగం చాలా మారిపోయింది. ప్రాంప్ట్, ఆటోమేటెడ్ టూల్స్ వాడకం పెరగడంతో కోడింగ్ ప్రక్రియ సులభంగా ఉంది. అయితే, ఇది ఎంతమేర ప్రోగ్రామర్లపై ప్రభావం చూపగలదనేది చెప్పడం కష్టం. సాఫ్ట్‌వేర్ అవసరం, గిరాకీ పెరుగుతుండటంతో కొత్త అవకాశాలు ఉంటాయని ఆల్ట్‌మన్ తెలిపారు. మరోవైపు, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు మాత్రం ఏఐతో భర్తీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కస్టమర్లతో మాట్లాఏ సందర్భంలో సున్నితంగా వ్యవహరించడం, భరోసా ఇవ్వడం వంటి మానవీయ ధోరణి కావాల్సిన సమయంలో కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలు తప్పనిసరి అని ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఎవరూ ఊహించని విషయం. కాబట్టి ఏఐకి డిమాండ్ ఉన్న రంగాలను ఎంచుకోవాలని ఆల్ట్‌మన్ పేర్కొన్నారు.

Next Story