జస్ట్.. రూ.5 వేలకే స్మార్ట్‌ ఫోన్‌.. అదిరిపోయే ఫోన్లు ఇవే !

by velandi.Saikiran |

ఇండియన్ మార్కెట్లోకి రకరకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఇప్పటికే.. మన ఇండియాలో అనేక రకాల మొబైల్ ఫోన్స్ ఉండగా

జస్ట్.. రూ.5 వేలకే స్మార్ట్‌ ఫోన్‌.. అదిరిపోయే ఫోన్లు ఇవే !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి రకరకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఇప్పటికే.. మన ఇండియాలో అనేక రకాల మొబైల్ ఫోన్స్ ఉండగా తాజాగా భారత మార్కెట్లోకి ఏఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ అనే కంపెనీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగానే రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ కూడా తక్కువ ధరకు లాంచ్ అయ్యాయి. ఇందులో ఒకటి 4g కాగా మరోటి 5 జి మొబైల్. ఏఐ ప్లస్ కంపెనీ పల్స్ (Ai+ Pulse), నోవా 5g (Nova 5G)పేరుతో రెండు కొత్త ఫోన్లు ఇండియన్ మార్కెట్లోకి వచ్చాయి. ఏఐ ప్లస్ పల్స్ మొబైల్ లో 6.7 ఇంచుల డిస్ప్లే ఉంది. అలాగే ఈ మొబైల్ రెండు వేరియంట్ లలో మనకు లభిస్తుంది.

4G +64 GB మోడల్ మొబైల్ ఫోన్ ధర 5000 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఇందులో 6 జిబి, 128 జిబి మోడల్ 7000 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. అదే సమయంలో ఏఐ ప్లస్ నోవా 5జి మొబైల్ కూడా రెండు మోడల్స్ లో లభిస్తుంది. 6 జిబి, 128 జీబీ మోడల్ మొబైల్ ధర 8 వేల రూపాయలుగా ఉంది. 8 జిబి, 128 జీబీ మొబైల్ ద్వారా పదివేల రూపాయలుగా ఫిక్స్ చేశారు. పల్స్ మోడల్ మొబైల్ ఫోన్స్ జులై 12వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. నోవా 5జి మొబైల్ ఫోన్స్ జులై 13వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇందులో గ్రీన్, పింక్, పర్పుల్, బ్లూ అలాగే బ్లాక్ కలర్స్ ఉంటాయి.

Next Story