- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Data Centre: ఏఐ బూమ్‌తో డేటా సెంటర్ రంగం మూడింతల వృద్ధి
ప్రస్తుతం డెవలపర్ల వద్ద 3 గిగావాట్లకు పైగా యాక్టివ్ ప్రాజెక్టుల పైప్‌లైన్ ఉండగా, అందులో దాదాపు 1 గిగావాట్ ఏఐ-ఆధారిత డేటా సెంటర్ సామర్థ్యం కలిగి ఉన్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డేటా సెంటర్ రంగం వేగంగా విస్తరిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశ డేటా సెంటర్ సామర్థ్యం 2025లో ఉన్న 1.6 గిగావాట్ల నుంచి 2030 నాటికి సుమారు 5 గిగావాట్లకు చేరుతుందని అవెండస్ క్యాపిటల్ తాజా నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం డెవలపర్ల వద్ద 3 గిగావాట్లకు పైగా యాక్టివ్ ప్రాజెక్టుల పైప్‌లైన్ ఉండగా, అందులో దాదాపు 1 గిగావాట్ ఏఐ-ఆధారిత డేటా సెంటర్ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ విస్తరణకు వచ్చే ఐదేళ్లలో సుమారు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని నివేదిక పేర్కొంది. ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ దేశవ్యాప్తంగా 6.5 లక్షల నుంచి 7 లక్షల వరకు జీపీయూల ఏర్పాటు జరిగే అవకాశం ఉండగా, ఇది మరో 23 బిలియన్ డాలర్ల(రూ. 2.18 లక్షల కోట్ల) పెట్టుబడి అవకాశాలను సృష్టించనుంది. ఫలితంగా భారత డేటా సెంటర్ రంగం వచ్చే ఐదేళ్లలో సగటున 26 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసే అవకాశముంది. ప్రస్తుతం దేశ డేటా సెంటర్ సామర్థ్యంలో సుమారు సగం ముంబైలోనే ఉంది. అంతర్జాతీయ కనెక్టివిటీ కారణంగా చెన్నై రెండో ప్రధాన హబ్‌గా ఎదుగుతుండగా, కోలోకేషన్, హైపర్‌స్కేలర్ ప్రాజెక్టులకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారుతోందని నివేదిక వెల్లడించింది.






