Salesforce: 1,000 మంది ఫ్రెషర్ల నియామకాలు ప్రకటించిన సేల్స్‌ఫోర్స్

by S Gopi |

ఏఐ విస్తరణ కోసం 1,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటామని తెలిపింది.

Salesforce: 1,000 మంది ఫ్రెషర్ల నియామకాలు ప్రకటించిన సేల్స్‌ఫోర్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల చాలా కంపెనీలు ఏఐ సహా రకరకాల కారణాలతో కంపెనీలు పెద్ద ఎత్తున లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రముఖ సాస్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ మాత్రం కొత్త నియామకాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. తాజా ప్రకటనలో ఏఐ విస్తరణ కోసం 1,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటామని తెలిపింది. ఏఐలో జరుగుతున్న అభివృద్ధిని మరింత ఉపయోగించే లక్ష్యంతో కొత్త గ్రాడ్యుయేట్లు, ఇంటర్న్‌లను నియమించుకోనున్నట్టు కంపెనీ సీఈఓ మార్క్ బేనియాఫ్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఏఐ ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలను లాగేసుకోదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం హెడ్‌లెస్ 360, ఏజెంట్‌ఫోర్స్ లాంటి ఏఐ సంబంధిత ప్రాజెక్టుల కోసం నియామకాలు నిర్వహిస్తున్నాం. ఏఐ అభివృద్ధి కోసం కొత్త జనరేషన్ అవసరమని, గతేడాది కంటే ఈసారి 5.6 శాతం ఎక్కువ నియామకాలు పెంచినట్టు వెల్లడించారు.

Next Story