- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI: 10-12 శాతం పెరగనున్న ఏఐ, డేటా ఇంజనీర్ల జీతాలు
ఐటీ సేవల కంపెనీలు, స్టార్టప్‌లు ఏఐ-ఆధారిత వృద్ధికి ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే ఏడాది ఏఐ స్కిల్స్ ఉన్న వారికి భారీ వేతనాలు ఉండనున్నాయని ఓ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ఏఐ బూమ్ మధ్య ఏఐ స్కిల్స్ ఉండే ప్రొఫెషనల్స్, డేటా ఇంజనీర్లు, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌కు అధిక డిమాండ్ ఉంది. 2026 ఏడాదికి వారంతా తమ వేతనాల్లో 10-12 శాతం వృద్ధిని చూస్తారని పలు స్టాఫింగ్ కంపెనీలు వెల్లడించాయి. ఐటీ సేవల కంపెనీలు, స్టార్టప్‌లు ఏఐ-ఆధారిత వృద్ధికి ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. అందుకే ఏఐ స్కిల్స్ వారిని కాపాడుకునేందుకు, కొత్త వారిని తీసుకునేందుకు ఎక్కువ ఖర్చు చేస్తాయని, జీతాలూ పెంచుతాయని కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం ప్రత్యేక స్కిల్స్ ఉన్న ఉద్యోగులు ఏడాదికి రూ. 30-38 లక్షల మేర జీతం తీసుకుంటున్నారు. కొంతమంది ఏఐ ఇంజనీర్లు, సైంటిస్టులు రూ. 60 లక్షల వరకు కూడా తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది వివిధ రంగాలలో జీతాల పెరుగుదల మితంగా ఉన్నప్పటికీ, ప్రత్యేక స్కిల్స్ ఉన్న ఉద్యోగులు వేతన ప్యాకేజీలలో గణనీయమైన పెరుగుదలను చూసే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొన్ని రంగాలు సగటు కంటే ఎక్కువ పెరుగుదలను చూస్తారు. క్లీన్ ఎనర్జీ, సెమీకండక్టర్, ఎన్‌బీఎఫ్‌సీలు, రక్షణ& ఏరోస్పేస్, ఎఫ్ఎంసీజీ, జీసీసీలు ఎక్కువ పెట్టుబడులు, డిజిటల్ అప్‌గ్రేడ్ వల్ల అధిక జీతం ఆఫర్ చేస్తాయని స్టాఫింగ్ కంపెనీలు పేర్కొన్నాయి.






