- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: 6వ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా భారత్‌ను దాటేసిన సౌత్‌కొరియా
ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న చిప్ కంపెనీలపై గ్లోబల్ పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడంతో కొరియా, తైవాన్ వంటి ఆసియా టెక్నాలజీ కేంద్రాలు గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రధాన ఆకర్షణగా మారుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల భారత స్టాక్ మార్కెట్లను వెనక్కి నెట్టి తైవాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఐదవ ఈక్విటీ మార్కెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణ కొరియా సైతం భారత్‌ను మరింత వెనక్కి నెట్టేసి ఆరవ స్థానానికి చేరింది. దీనికి ప్రధాన కారణంగా చిక్ తయారీ కంపెనీల ర్యాలీ కావడం గమనార్హం. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, కొరియాలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 86 శాతం పెరిగి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, భారత మార్కెట్ విలువ 4.8 ట్రిలియన్ డాలర్లకు పరిమితమైంది. దీంతో దక్షిణ కొరియా భారత్‌ను అధిగమించి ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా నిలిచింది. ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న చిప్ కంపెనీలపై గ్లోబల్ పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడంతో కొరియా, తైవాన్ వంటి ఆసియా టెక్నాలజీ కేంద్రాలు గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రధాన ఆకర్షణగా మారుతున్నాయి. మన మార్కెట్లకు సంబంధించి ఈ ఏడాది కొన్ని ప్రతికూల అంశాలు ప్రభావితం చేశాయి. బలహీన రూపాయి, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, పెరిగిన ఇంధన ధరల కారణంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అలాగే ఏఐ సరఫరాలో నేరుగా లాభపడే పెద్ద కంపెనీల కొరత మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ఫలితంగా విదేశీ ఇన్వెస్టర్లు సుమారు 26 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 25 లక్షల కోట్ల) విలువైన భారతీయ షేర్లను విక్రయించగా, ప్రధాన స్టాక్ సూచీలు ఈ ఏడాది 11 శాతం వరకు పడిపోయాయి.






