- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OpenAI: బెంగళూరులో కొత్త ఆఫీస్ ప్రారంభించనున్నట్లు ఓపెన్‌ఏఐ ప్రకటన
బెంగళూరులోని తన ఆఫీసును ఏడాది ఆఖర్లోగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్పష్టం చేసింది

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కంపెనీలు భారత్ బాట పడుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ బెంగళూరులో తన మొట్టమొదటి ఆఫీసును ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంథ్రోపిక్ బాటలోనే మరో దిగ్గజ ఏఐ కంపెనీ ఓపెన్ఏఐ సైతం భారత్‌లో తన విస్తరణను వేగవంతం చేయాలని భావిస్తోంది. దీనికోసం బెంగళూరు తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. బెంగళూరులోని తన ఆఫీసును ఏడాది ఆఖర్లోగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్పష్టం చేసింది. భారత్ ఇప్పటికే అనేక దేశాల కంటే ఎక్కువగా ఏఐని ఉపయోగిస్తోంది. దేశంలోని ప్రజలు, విద్యార్థులు, కంపెనీలు దీనిని త్వరగా అలవాటు పడుతున్నారు. దేశంలో అత్యంత ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఉన్నారు. దీనికితోడు ప్రభుత్వం ఏఐ అభివృద్ధికి కీలక మద్దతిస్తోంది. దీనివల్ల భారత్ ఏఐ భవిష్యత్తును రూపొందించడానికి అత్యంత అనువైన స్థితిలో ఉంది. దేశీయ అవసరాలకే కాకుండా ప్రపంచానికి న్యాయబద్ధంగా అందించడానికి సిద్ధంగా ఉందని ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. కాగా, ఓపెన్ఏఐ ఇప్పటికే దేశ రాజధాన్ని ఢిల్లీలో ఆఫీసును ఏర్పాటు చేసింది. త్వరలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కొత్త ఆఫీస్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా బెంగళూరులోనూ ఆఫీసు ఏర్పాటుపై ప్రకటన రావడంతో ఓపెన్ఏఐ భారత మార్కెట్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు ఉంది.






