త్వరలో ఆదిత్య బిర్లా గ్రూప్ సొంత ఆభరణాల బ్రాండ్

by Dishanational1 |
త్వరలో ఆదిత్య బిర్లా గ్రూప్ సొంత ఆభరణాల బ్రాండ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఆదిత్య బిర్లా గ్రూప్ త్వరలో సొంత ఆభరణాల బ్రాండ్‌ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. 'నోవల్ జ్యువెల్స్ లిమిటెడ్' బ్రాండ్ పేరుమీద కంపెనీ వచ్చే జూలైలో కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది జూన్‌లో కంపెనీ రిటైల్ జ్యువెలరీ వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం సుమారు రూ. 5,000 కోట్ల వరకు పెట్టుబడులను ప్రకటించింది. నోవల్ బ్రాండ్‌ కింద దేశీయ వినియోగదారుల కోసం బడా సైజ్‌లో ఎక్స్‌క్లూజివ్ జ్యువెలరీ రిటైల్ స్టోర్లను ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. నోవల్ బ్రాండ్‌లో ప్రత్యేకమైన డిజైన్, స్థానిక కస్టమర్ల ఇష్టాలు, అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపార వివరాలను త్వరలో వెల్లడిస్తామని కంపెనీ గతేడాది ప్రకటనలో వెల్లడించింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed